NTV Telugu Site icon

NTR: సముద్ర వీరుడు స్టైలిష్ అవతారం ఎత్తాడు…

Ntr

Ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల్లో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తూ ఉంటాడు. చిన్న వయసులోనే సీరియస్ క్యారెక్టర్స్, మాస్ సినిమాలు చేసి మాన్ ఆఫ్ మాసెస్ అనిపించుకున్నాడు ఎన్టీఆర్. మాస్ కి కేరాఫ్ అడ్రెస్ లా కనిపించే ఎన్టీఆర్, ఆఫ్ లైన్ లో మాత్రం స్టైల్ గా కనిపిస్తూ ఉంటాడు. “క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా లోపల మాస్  అలానే ఉంది, దాన్ని బయటకి తీస్తే రచ్చరచ్చే” అనే డైలాగ్ బృందావనం సినిమాలో ఉంది. ఈ డైలాగ్ ని కాస్త ఛేంజ్ చేసి “ఆఫ్ లైన్ కాబట్టి స్టైల్ గా ఉన్నా… లోపల మాస్ అలానే ఉంది. అది థియేటర్స్ లో చూస్తారు” అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఎప్పుడు బయట కనిపించే ట్రెండీగా స్టైలిష్ గా క్లాస్ లుక్ లో ఉన్న మాస్ హీరోలా కనిపిస్తాడు. అందుకే ఎన్టీఆర్ ఆఫ్ స్క్రీన్ ఫొటోస్ ని నందమూరి అభిమానుల్లో స్పెషల్ క్రేజ్ ఉంది. లేటెస్ట్ గా ఎన్టీఆర్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చాడు.

ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న ఎన్టీఆర్, సముద్ర వీరుడిగా యుద్ధం చేస్తున్నాడు. దేవరకి చిన్న బ్రేక్ ఇచ్చి ఈ సమయంలో ఒక యాడ్ చేసాడు ఎన్టీఆర్. ఈ యాడ్ లో ఎన్టీఆర్ కనిపించబోయే లుక్ ని స్టైలిష్ ‘ఆలిమ్ హాకిమ్’ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. “Had an amazing time yesterday doing hair for our Man Of Masses @tarak9999 It is always fun shooting with ntr… I love his high-octane and positive energy” అని కోట్ చేస్తూ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటోని ఆలిమ్ పోస్ట్ చేసాడు, ఇందులో ఎన్టీఆర్ కొత్త హెయిర్ స్టైల్ తో స్పెక్ట్స్ పెట్టుకోని స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. సినిమాల్లో ఎన్టీఆర్ ఇంత స్టైలిష్ గా కనిపించి చాలా రోజులే అయ్యింది. నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత ఎన్టీఆర్ మళ్లీ ఆ రేంజ్ క్లాస్ రోల్స్ చేయలేదు. మరి ఇప్పుడున్న మాస్ ఇమేజ్ తో పాన్ ఇండియా సినిమాలతో అలాంటి క్లాస్ సినిమాని ఎన్టీఆర్ చేస్తాడో లేదో చూడాలి.