పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలను చేతిలో పెట్టుకొని ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా షూటింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆది పురుష్ ను ఫినిష్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇవి పూర్తయాక స్పిరిట్ చిత్రాన్ని ఫినిష్ చేయాలి.. మధ్యలో మారుతితో రాజా డీలక్స్ కమిట్ అయ్యాడు. మధ్యలో సినిమా ప్రమోషన్స్ ఉండనే ఉన్నాయి. రెండేళ్ల వరకు ప్రభాస్ బిజీ గా ఉండనున్నాడు. ఇక రెమ్యూనిరేషన్ విషయంలో ప్రభాస్ మొదటి వరుస ఉన్నాడు. వందకోట్ల రెమ్యూనిరేషన్ తీసుకొన్న హీరోలో ప్రభాస్ ఒకడు. డార్లింగ్ ఒక్కసారి కనిపిస్తే చాలు కోట్లు అయినా ఇచ్చేస్తాం అని వాణిజ్య ప్రకటనల యాజమాన్యం ఇంకా ప్రభాస్ వెనుక తిరుగుతున్నారు కూడా.. ఇక వీటిని అన్నింటిని కాదని డార్లింగ్ హోటల్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తెలుగు రుచులను అందించాలని ప్రభాస్ ఆలోచిస్తున్నాడని, ఇందుకు తగ్గట్లుగానే ఇటలీ, స్పెయిన్, దుబాయ్ దేశాల్లో తన హోటల్ బిజినెస్ ను వ్యాప్తి చేయాలనీ చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దీనికి కేవలం ప్రభాస్ మాత్రమే ఓనర్ గా ఉండాలనుకుంటున్నాడట. అయితే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ప్రభాస్ కు కొద్దిగా తీరిక ఉన్న బిజినెస్ పనులను చూసుకొంటున్నాడట. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిజీ షెడ్యూల్స్ తో బిజీగా ఉంటూ మరోపక్క బిజినెస్ చూస్తూ ఉంటే ప్రభాస్ ఆరోగ్యం చెడిపోతుందని, ఆరోగ్యం పై శ్రద్ద పెట్టాలని సూచిస్తున్నారు. మరికొందరు సినిమాలు చాలడం లేదా డార్లింగ్.. ఇంకా ఇవి అవసరమా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.