NTV Telugu Site icon

Karthikeya: హీరోను బ్లాక్ మెయిల్ చేస్తున్న యువతి.. ఆ పని చేయకపోతే చెయ్యి కోసుకుంటా అంటూ

Karthikeya

Karthikeya

Karthikeya: టాలీవుడ్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి మా అనుకుంటే .. వాళ్లని చచ్చేవరకు వదిలిపెట్టరు. ఇక సోషల్ మీడియాలో స్టార్లు పెట్టే పోస్టులకు.. అభిమానులు కామెంట్స్ చేయడం .. తిరిగి వారిని రిప్లై ఇవ్వమని అడగడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఒక హీరో అభిమాని మాత్రం రిప్లై ఇవ్వకపోతే చెయ్యి కోసుకుంటా అని బెదిరించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ హీరో ఎవరో కాదు.. యంగ్ హీరో కార్తికేయ. ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ సృష్టించిన ఈ హీరో చాలా ఏళ్ళ తరువాత బెదురులంక 2012 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే కార్తికేయకు తన ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Gruhalakshmi Kasturi: అక్కా అంటూనే నన్ను అసభ్యంగా టచ్ చేశాడు.. దుల్కర్ కూడా అలానే

ఇక తాజాగా కార్తికేయ ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించాడు. అభిమానుల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చాడు. అయితే ఈ చిట్ చాట్ సెషన్ లో ఒక యువతి.. ” కార్తికేయ నాకు రిప్లై ఇవ్వకపోతే చెయ్యి కోసుకుంటా” అని రాసుకొచ్చింది. దాన్ని చూసిన కార్తికేయ.. ” అయ్యో వద్దు .. వద్దు” అని సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ యువతి సరదాగానే అన్నా కూడా.. నెటిజన్స్ సైతం వద్దు.. అంత పని చేయకు అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక కార్తికేయ సినిమాల విషయం కొస్తే .. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో కుర్రహీరో జోరు పెంచుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మరో రెండు సినిమాలను అనౌన్క్ చేయనున్నట్లు సమాచారం. మరి ముందు ముందు కార్తికేయ ఎలాంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.