NTV Telugu Site icon

Sree Leela: నువ్వు అలా పిలవాలే కానీ… కుర్రాళ్లు ఎక్కడికైనా వస్తారు

Sreeleela

Sreeleela

యంగ్ హీరోయిన్ శ్రీలీలా ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సినిమాల్లో నటిస్తూ శ్రీలీలా ఫుల్ బిజీగా ఉంది. దర్శకులు, నిర్మాతలు, హీరోలు కూడా శ్రీలీలాని హీరోయిన్ గా ప్రిఫర్ చేస్తున్నారు అంటే ఆమె క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రష్మిక, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్స్ ని కూడా పక్కకి నెట్టేసి శ్రీలీల ఫుల్ స్వింగ్ లో ఉంది. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకున్న శ్రీలీలకి యూత్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది.

Read Also: Prabhas: ‘సలార్’ నుంచి నెక్స్ట్ వచ్చే కంటెంట్ ఇదే…

ధమాకా సినిమాలో డాన్స్ అండ్ క్యూట్ లుక్స్ తో శ్రీలీలా యూత్ ని మాయ చేసింది, ఆ మాయ ఇండస్ట్రీ వర్గాలపైకి కూడా పాకినట్లు ఉంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న ఈ కన్నడ బ్యూటీ ట్విట్టర్ లో కొత్త ఫొటోస్ ని షేర్ చేసింది. “Come Take a Walk With Me” అనే కొటేషన్ తో మూడు ఫోటోలని శ్రీలీలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో  క్యూట్ అండ్ హాట్ గా కనిపిస్తున్న శ్రీలీలా ఫోటోలు నెట్ లో ట్రెండ్ అవుతున్నాయి. నువ్వు అలా నాతో కలిసి నడువు అని అడగాలే కానీ కుర్రాళ్లు ఎక్కడికైనా, ఎంత దూరం అయినా వచ్చేస్తారు అంటూ కామెంట్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడే ఇలా ఉంటే స్టార్ హీరోలతో శ్రీలీలా నటిస్తున్న సినిమాలు కూడా రిలీజ్ అయితే తెలుగులో ఆమెని పట్టుకోవడం కూడా కష్టమే.

Show comments