‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ‘అనన్య నాగళ్ల’. మొదటి సినిమాతోనే మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకున్న అనన్య, ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాలో నటించి అందరి దృష్టిలో పడింది. పవన్ కళ్యాణ్ నటించిన మూవీ కాబట్టి ఎక్కువ రీచ్ ఉంటుంది అనే ఆలోచనతో అనన్య నాగళ్ల తన క్యారెక్టర్ ని అంత స్కోప్ లేకపోయినా వకీల్ సాబ్ సినిమా చేసింది. ఈ మూవీలో అనన్యకి డైలాగ్ కూడా కానీ ఆమె కోరుకున్నట్లు మంచి రీచ్ అయితే వచ్చింది. ఇక్కడి నుంచి అయినా అనన్య నాగళ్ల మంచి మంచి సినిమాల్లో నటించి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తుందని అంతా అనుకున్నారు కానీ అనన్య నాగళ్ల మాత్రం చాలా సెలక్టివ్ సినిమాలనే చేస్తుంది.
Read Also: Rashi Khanna: ‘ఫర్జీ’ ట్రైలర్ లాంచ్ కి హైలైట్ గా రాశీ ఖన్నా గ్లామర్ షో
సోషల్ మీడియాలో స్కిన్ షోకి హద్దులు పెట్టుకోకుండా ఫోటోలు పోస్ట్ చేసే అనన్య నాగళ్లకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. పర్ఫెక్ట్ షేప్ లో ఉండే అనన్య ఫోటోస్ కోసం ఫాలోవర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. అంతగా తన గ్లామర్ తో ఇంప్రెస్ చేసిన అనన్య నాగళ్ల ప్రస్తుతం సమంతా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. శకుంతల, కన్వ మహర్షి ఆశ్రమంలో ఉండగా ఆమెకి తోడుగా ఉండే ప్రియంవద అనే క్యారెక్టర్ ని అనన్య నటిస్తోంది. శాకుంతలం సినిమాలో కాస్త ఎక్కువ సేపే కనిపించే అనన్య నాగళ్ల ఈ మూవీతో మంచి పేరు తెచ్చుకునే ఛాన్స్ ఉంది. వకీల్ సాబ్ తో రీచ్ మాత్రమే వచ్చింది ఈసారి శాకుంతలం సినిమాతో అనన్య నాగళ్ల కెరీర్ కూడా సెట్ అయిపోతుందేమో చూడాలి.
