Site icon NTV Telugu

Anil Ravipudi: పాన్ ఇండియా సినిమాలు కాదు.. కానీ పక్కా పైసా వసూల్

Anil-Ravipudi

Anil Ravipudi : యంగ్ అండ్ ట్యాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ F3. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం మే 27న థియేటర్లలోకి రానుంది. ఈ ఫన్ రైడ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. అభిమానులు F3 విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఒక న్యూస్ పోర్టల్‌తో జరిగిన చిట్ చాట్ లో ఒక సినిమా కోసం ఎక్కువ సమయం గడపడం తనకు ఇష్టం లేదని చెప్పాడు.

Read Also : RRR : వేటగాడు వచ్చే వరకే… గడ్డ కట్టించే చలిలో చెర్రీ ఫ్యాన్స్… పిక్ వైరల్!

“నాకు విసుగొచ్చేసింది… ఒక సినిమా కోసం ఎక్కువ సమయం గడపడం ఇష్టం ఉండదు. నేను పాన్-ఇండియన్ సినిమాలు చేయడం లేదు. కానీ నా తరహా పక్కా పైసా వసూల్ ఎంటర్‌టైనర్‌ లను తీస్తున్నాను” అని చెప్పుకొచ్చారు. తన సినిమాలను 5-6 నెలల్లో పూర్తి చేసేలా చూసుకుంటానని లేదా బోర్ కొడుతుందని అనిల్ అన్నారు. మహమ్మారి కారణంగా అనిల్ రావిపూడి F3 కోసం చాలా సమయం వెచ్చించాల్సి వచ్చిందన్న విషయం తెలిసిందే.

Exit mobile version