NTV Telugu Site icon

Yo Yo Honey Singh: హీరోయిన్‌తో డేటింగ్.. రెడ్‌హ్యాండెడ్‌గా బుక్.. వీడియో వైరల్

Nushratt Honey Singh

Nushratt Honey Singh

Yo Yo Honey Singh And Nushrratt Bharuccha Dating Rumours Going Viral: సినీ పరిశ్రమకు చెందిన జంటలను మనం తరచుగా చూస్తూనే ఉంటాం. వారి మధ్య ప్రేమ ఉంటుందో లేదో తెలీదు కానీ.. వాళ్లు ఎప్పుడూ పార్టీలకు, ఈవెంట్లకు కలిసే హాజరవుతుంటారు. మరికొన్ని జంటలైతే షాక్‌లు ఇస్తుంటాయి. అసలు కలలో కూడా ఉహించని సెలెబ్రిటీలు, అనుకోకుండా కెమెరాలకు చిక్కుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్ సింగర్, ర్యాపర్ యోయో హనీసింగ్ విషయంలోనూ అదే జరిగింది. ఇతడు లేటెస్ట్‌గా బాలీవుడ్ నటి నుష్రత్ భారుచాతో కలిసి కెమెరాకి చిక్కాడు. అది కూడా ఆమె చెయ్యి పట్టుకొని, మీడియా కంటికి దొరికాడు.

Live-In Relationship: భర్తతో విడాకులు.. డ్రైవర్‌తో సహజీవనం.. కట్ చేస్తే..

ఇటీవల ముంబైలో ఒక గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి బీ టౌన్‌కి చెందిన కొందరు సెలెబ్రిటీలు హాజరు అయ్యారు. ఈ ఈవెంట్ ముగిసిన అనంతరం ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా.. అందరూ ఎలా వచ్చారో, అలాగే వెళ్లిపోయారు. అయితే.. యోయో హనీసింగ్, నుష్రత్ భారుచా మాత్రం కలిసి కనిపించారు. ఆ ఈవెంట్ నుంచి బయటకొస్తున్న క్రమంలో.. హనీసింగ్ ఆమె చెయ్యి పట్టుకొని తీసుకొచ్చాడు. గతంలో ఎప్పుడూ వీరిద్దరు ఇలా కనిపించిన దాఖలాలు లేవు. పీకల్లోతు ప్రేమలో ఉన్న ప్రేమికుల్లాగా ఇద్దరూ దర్శనమిచ్చారు. దీంతో.. వీళ్లు డేటింగ్‌లో ఉన్నారా? అనే పుకార్లు ఊపందుకున్నాయి. బహుశా వీళ్లిద్దరు ప్రేమలో ఉండొచ్చని, అందుకే ఇలా చేతులు పట్టుకొని మరీ తిరుగుతున్నారని చెప్పుకుంటున్నారు. అయితే.. ఈ వార్తలపై ఆ ఇద్దరు ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Shocking Murder : యూపీలో పట్టపగలే దారుణం.. యువతిని తుపాకీతో కాల్చి చంపిన దండగులు

కాగా.. భార్యతో గొడవలు నెలకొన్న కారణంగా తన ప్రొఫెషనల్ జీవితానికి కొంతకాలం పాటు దూరంగా ఉన్న హనీసింగ్, ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ తన కెరీర్‌పై ఫోకస్ పెట్టాడు. అప్పుడప్పుడు విభిన్నమైన పాటలను రిలీజ్ చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మరోవైపు.. నుస్రత్ కూడా క్రేజీ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవల సెల్ఫీ సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు చోరీ సినిమా కోసం సిద్ధమవుతోంది.

Show comments