Site icon NTV Telugu

King Nag: నా సామి రంగ… ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే…

King Nag

King Nag

కింగ్ నాగార్జున నటిస్తున్న 99వ సినిమా ‘నా సామి రంగ’. నాగార్జున బర్త్ డే రోజున అనౌన్స్ అయిన ఈ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 80% కంప్లీట్ అయ్యింది. ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ నాగార్జునని కంప్లీట్ మాస్ లుక్ లో చూపించడానికి రెడీ అయ్యాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘నా సామి రంగ’ సినిమాకి ప్రసన్న కుమార్ బెజవాడ కథ-డైలాగ్స్ అందిస్తున్నాడు. లాంగ్ హెయిర్, బియర్డ్ లుక్ తో నాగార్జున కొత్తగా కనిపిస్తున్నాడు. నా సామి రంగ ప్రోమోకి ‘జాతారో జాతర’ అంటూ కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ గా వర్కౌట్ అయ్యింది.

Read Also: Kalyan Ram: డైనోసర్ ముందుకి డెవిల్?

ఇప్పుడు కీరవాణి నా సామి రంగ సినిమా నుంచి మొదటి సాంగ్ ని సిద్ధం చేసాడు. నాగార్జున, కీరవాణిల కాంబినేషన్ లో సూపర్ ఆల్బమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నా సామి రంగ సినిమా నుంచి “ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే” సాంగ్ బయటకు రానుంది. ఈ సాంగ్ అనౌన్స్మెంట్ కోసం రిలీజ్ చేసిన పోస్టర్ లో నాగార్జున ట్రాక్టర్ పైన కాలు పెట్టి మస్త్ ఉన్నాడు. పంచె కట్టులో నాగార్జున వింటేజ్ వైబ్స్ ని కలిగిస్తున్నాడు. మరి సాంగ్ లో నాగార్జున ఎవరిని చూసి ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే అంటున్నాడో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.

Exit mobile version