Site icon NTV Telugu

Yash: యష్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆరోజు కలవడం కష్టం

Yash

Yash

Yash: కెజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు కన్నడ హీరో యష్. ఇక కెజిఎఫ్ తరువాత యష్ కొత్త చిత్రాన్ని ప్రకటించడానికి మూడేళ్లు పట్టింది. ఈ మధ్యనే టాక్సిక్ అనే సినిమాతో వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. మ‌ల‌యాళ డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నుంది. డిఫ‌రెంట్‌ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా టాక్సిక్‌ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. య‌శ్ హీరోగా న‌టిస్తోన్న 19వ సినిమా ఇది. దీనిపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక జనవరి 8 న యష్ పుట్టినరోజు. దీంతో ఆరోజు టాక్సిక్ అప్డేట్ వస్తుందని కొందరు ఎదురుచూస్తుండగా.. చాలామంది ఆరోజు.. యష్ ను స్వయంగా కలిసి విష్ చేయాలనీ ఆశలు పెట్టుకున్నారు. స్టార్ హీరోల పుట్టినరోజు వస్తే.. ఆ హీరో ఇంటిదగ్గర అభిమానులు పడిగాపులు కాస్తూ విష్ చేయడానికి సిద్ధంగా ఉంటారని తెల్సిందే. అయితే ఈసారి యష్.. అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. తన పుట్టినరోజుకు తాను ఇంటిదగ్గర ఉండడం లేదని తెలిపాడు.

“మేము టాక్సిక్.. ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ అని ప్రకటించి దాదాపు ఒక నెల అయ్యింది. నా సినిమాపై మీరు కురిపించిన ప్రేమ మరియు ప్రశంసలు నాకు ప్రపంచాన్ని సూచిస్తాయి. మీ ఉత్సాహం, రియాక్షన్స్, సిద్ధాంతాలు మరియు విశ్లేషణలు నన్ను మరింత చేయమని ప్రోత్సహిస్తున్నాయి. మీలో చాలా మంది నా పుట్టినరోజున నన్ను వ్యక్తిగతంగా కలవడానికి, సినిమా గురించి మీరు ఏమనుకుంటున్నారో పంచుకోవడానికి ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మీతో కలిసి ఉండాలని నేను కూడా ఉండాలని ఉంది. మీతో ఉండగలగడం అనేది నేను చాలా విలువైన వాటిలో ఒకటి. కానీ, నేను జనవరి 8న దూరంగా ఉంటాను కాబట్టి మనం కొంచెం వేచి ఉండాల్సి రావచ్చు. నన్ను నమ్మండి.. వ్యక్తిగతంగా నేను లేకపోయినా, మీ నుంచి వచ్చే ప్రతి విష్ ఎంతో స్పెషల్ గా ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు. ఇక యష్ లేకపోయినా ఆయన బర్త్ డేను గ్రాండ్ గా చేయాలనీ అభిమానులు ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది. మరి టాక్సిక్ తో యష్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Exit mobile version