Site icon NTV Telugu

Yash: నాకు ఆ క్రెడిట్ వద్దు.. అది నాది కాదు

yash

yash

యావత్ సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా కెజిఎఫ్ 2. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 14 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టిస్తోంది. బెంగుళూరులో జరిగిన ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో చిత్ర బృందం పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ వేదికపై హీరో యష్ మాట్లాడుతూ మొదట దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కి నివాళులు అర్పించారు.

అనంతరం సినిమా గురించి మాట్లాడుతూ” ఎనిమిదేళ్ల కష్టం ఈ సినిమా.. లైట్ మ్యాన్ దగ్గరనుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు వారి చెమట, రక్తాన్ని చిందించి ఈ సినిమాను పూర్తిచేశారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక ఈ ఈవెంట్ కి అడగగానే విచ్చేసిన స్టార్లకు థాంక్స్.. ప్రతిఒక్కరు సినిమా చూసి ఆ క్రెడిట్ నాకు ఇస్తున్నారు. అది సరికాదు. కేజీఎఫ్ 2 కన్నడ సినిమాకు గర్వకారణం. ఇది ప్రశాంత్ నీల్ సినిమా, ఆ సినిమాకు నాకు క్రెడిట్ ఇవ్వడం సరికాదు.. మా క్రెడిట్ కూడా వద్దు.. అది కేవలం ప్రశాంత్ నీల్ కే చెందాలి” అని చెప్పుకొచ్చారు.

Exit mobile version