NTV Telugu Site icon

Yash: హాలీవుడ్ మీద కన్నేసిన యష్

Untitled Design (54)

Untitled Design (54)

రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్‌దాస్ రాశి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భారతీయ భాషలతో పాటుగా ఇంగ్లీష్‌లోనూ సమాంతరంగా షూట్ చేస్తున్నారు.ఇలా ఇంగ్లీష్‌లో చిత్రీకరిస్తున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా ‘టాక్సిక్’ రికార్డుల్లోకి ఎక్కింది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ  సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యష్ తో పాటు ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు నటిస్తున్నారు .దీంతో ‘టాక్సిక్‌’ చిత్రంపై భారత్‌లోనే కాకుండా, అంతర్జాతీయంగానూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో భాగంగా తాజాగా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ..

Also Read:Aadhi Pinisetty : విడాకుల రూమర్స్‌కి చెక్ పెట్టిన యంగ్ హీరో..

‘ ‘టాక్సిక్’ కోసం మేము ఒక అంతర్జాతీయ స్థాయి కథను సృష్టించాలనుకున్నాం. ఇది భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలి. అందుకే కన్నడ, ఇంగ్లీష్ రెండింటిలోనూ చిత్రీకరించాం. ఈ సినిమా భాషలు, సాంస్కృతిక భేదాలను దాటి అందరి హృదయాలను తాకేలా ఉంటుంది’ అని తెలిపింది. నిర్మాత వెంకట్ నారాయణ మాట్లాడుతూ ‘టాక్సిక్’ విషయంలో మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునే చిత్రంగా దీని రూపొందిస్తున్నాం. ‘టాక్సిక్’ తప్పకుండా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది, అలాగే భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంది’ అన్నారు.