NTV Telugu Site icon

War 2: మాస్ యాక్షన్ ఫిల్మ్ లోకి ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ ఎంట్రీ?

War 2

War 2

ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ కలిసి ఒక సినిమా ‘వార్ 2’లో నటించబోతున్నారు అనే వార్త ఎలా బయటకి వచ్చిందో తెలియదు కానీ ఈ న్యూస్ బయటకి వచ్చినప్పటి నుంచి ఇండియాలో ‘వార్ 2’ సినిమా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలుగా పేరున్న ఎన్టీఆర్-హ్రితిక్ ఒక సినిమాలో నటించడం, అది కూడా హీరో-విలన్ గా నటించడం అనేది చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ షకల్ మార్చేయ్యగల ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తుండగా, యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ‘వార్ 2’ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ‘వార్ 2’ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, లీడ్ కాస్టింగ్ నుంచి అఫీషియల్ గా ఎన్టీఆర్ Vs హ్రితిక్ రోషన్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు కానీ మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందనే హాప్ అందరిలోనూ ఉంది.

ఈ స్పై యాక్షన్ ఫిల్మ్ లో హీరోయిన్ గా అలియా భట్ నటిస్తుందనే వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. డిపెండబుల్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న అలియా భట్ ‘వార్ 2’లో యాక్షన్ రోల్ ప్లే చేస్తుందని అంతా అనుకుంటున్నారు. అలియా భట్ ఇప్పటివరకూ యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ ప్లే చెయ్యలేదు కాబట్టి వార్ 2లో ఆమె ఉంటే బాగుటుంది. పైగా టైగర్ సీరీస్ లో కత్రినా కైఫ్, పఠాన్ సీరీస్ లో దీపిక లాక్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఇంకో హీరోయిన్ ని స్పై యూనివర్స్ లోకి తీసుకోని రావాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే మేకర్స్ అలియా భట్ సైడ్ అడుగులు వేస్తున్నారట. మరి అలియా ఫైనల్ అయ్యిందా? ఒకవేళ ఫైనల్ అయితే అలియా ఎవరికీ పెయిర్ గా ఉంటుంది? అనే విషయాలకి సమాధానం తెలియాల్సి ఉంది.

Show comments