రాక్ స్టార్ యష్ నటించిన ఓ కన్నడ సినిమాను ‘రారాజు’ పేరుతో తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు.
‘కెజిఎఫ్’ కంటే ముందు కన్నడలో ‘సంతు స్ట్రైట్ ఫార్వర్డ్’ పేరుతో విడులైన ఈ సినిమాకు మహేశ్ రావు దర్శకుడు. ఇందులో యశ్ భార్య రాధికా పండిట్ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఈ సినిమాను పద్మావతి పిక్చర్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో జూన్ ద్వితీయార్థంలో బారీ ఎత్తున రిలీజ్ చేయబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ విడుదల చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పద్మావతి పిక్చర్స్ సుబ్బారావు గత 25 సంవత్సరాలుగా ఎన్నో సినిమాలను రిలీజ్ చేశారు. నాకు బాగా కావాల్సిన వ్యకి. ఇప్పుడు ప్రొడక్షన్ లోకి వస్తున్నారు. ఇది పెద్ద సక్సెస్ కావాలి. మరిన్ని మంచి సినిమాలు ఈ బ్యానర్ లో రావాలి’ అని అన్నారు.
నిర్మాత వి.ఎస్.సుబ్బారావు మాట్లాడుతూ ”రారాజు’ చిత్రాన్ని జూన్ లో రిలీజ్ చేస్తున్నాము. మా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసిన వినాయక్ గారికి కృతజ్ఞతలు. యశ్ అతని భార్య రాధిక పండిట్ కలసి నటించిన ఈ చిత్రం కన్నడ లో లాగే తెలుగు లో కూడా ఘన విజయం సాధిస్తుంద’నే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
