Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic: సినిమా హిట్ అయినప్పుడు హీరో గురించి ప్రశంసలు రావడం ఎంత సహజమో.. సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో రావడం కూడా అంతే సహజం. ప్రస్తుతం కన్నడ స్టార్ యష్ విషయంలో ఇదే జరుగుతోంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’ ఇటీవల థియేటర్లలో విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సినిమాపై బాగానే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో, యష్ స్టార్డమ్కు సంబంధించిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి ఆ మాటలకు యష్ తల్లి పుష్ప ఘాటుగానే స్పందించింది.
‘కేజీఎఫ్’ సినిమాతో యష్ పాన్ ఇండియా స్టార్ అయిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ చిత్రాలు యష్‌కు పాన్ ఇండియా స్థాయిలో భారీ గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే యష్ అభిమానులు మాత్రం ఆయన స్టార్డమ్ కేవలం ‘కేజీఎఫ్’తోనే మొదలైందని అంగీకరించరు. అంతకుముందే కన్నడ చిత్రసీమలో యష్‌కు ప్రత్యేకమైన మార్కెట్, అభిమానగణం ఉంది. ఇప్పుడు ఇదే విషయాన్ని యష్ తల్లి పుష్ప మరోసారి బలంగా ప్రస్తావించారు.
Also Read
ఆమె అంతలా రియాక్ట్ అవ్వడానికి గతంలో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలే నని తెలుస్తోంది. గతంలో ‘కోటబొమ్మాళి పీఎస్’ ప్రమోషన్ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమా బడ్జెట్, హీరోల మార్కెట్, స్టార్డమ్ గురించి వ్యాఖ్యానించారు. ఆ సందర్భంలో భారీ బడ్జెట్ సినిమాలకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందనే విషయాన్ని వివరిస్తూ ‘కేజీఎఫ్‌కు ముందు యష్ ఎవరు?’ అనే ప్రశ్నను ఆయన ప్రస్తావించారు. అప్పట్లోనే ఈ మాటలు రక రకాలుగా స్పందించారు అభిమానులు. యష్‌కు ‘కేజీఎఫ్’కు ముందు కూడా స్టార్ ఇమేజ్ ఉందని, ఆ విషయాన్ని అల్లు అరవింద్ విస్మరించినట్టుగా అభిమానులు అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు ‘టాక్సిక్’ చుట్టూ చర్చ జరుగుతున్న సమయంలో అవే మాటలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యష్ తల్లి పుష్ప ఘాటుగానే స్పందించారు. తన కుమారుడిని ‘కేజీఎఫ్’తో మాత్రమే గుర్తించడంపై ఆమె ప్రశ్నించారు. యష్ ‘కేజీఎఫ్’కు ముందే కర్ణాటకలో స్టార్ హీరో అని ఆమె స్పష్టం చేశారు. ఎన్నో సినిమాల్లో నటించి, తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్న తర్వాతే యష్ ‘కేజీఎఫ్’లాంటి భారీ ప్రాజెక్ట్‌లోకి వెళ్లాడని ఆమె చెప్పుకొచ్చారు.
యష్ ఎవరో తెలుసుకోవడానికి ‘కేజీఎఫ్’ వరకు ఎందుకు వెళ్లాలి అని పుష్ప ప్రశ్నించారు. కన్నడ చిత్రసీమలో తన కుమారుడు సాధించిన విజయాలు, అతని సినిమాల బాక్సాఫీస్ ఫలితాలు ఇప్పటికే అతని స్టార్డమ్కు నిదర్శనమని ఆమె అన్నారు. ‘ అంతేకాదు యష్ ఎదుగుదల వెనుక ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదని పుష్ప ప్రత్యేకంగా గుర్తుచేశారు. తన కుమారుడు ఎలాంటి నేపథ్యం లేకుండా కష్టపడి పరిశ్రమలో తన స్థానాన్ని సంపాదించుకున్నాడని ఆమె చెప్పారు. తనకు ఉన్న పేరు, స్టార్డమ్, అభిమానగణం అన్నీ యష్ స్వయంకృషితో సాధించుకున్నవేనని, తన కొడుకును ఉగ్రవాదిలా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సారి కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వివాదంపై అల్లు అరవింద్ నుంచి ఏదైనా స్పందన వస్తుందా, ‘టాక్సిక్’పై కొనసాగుతున్న చర్చ ఎటువైపు వెళ్తుందా అనేది హాట్ టాపిక్ గా మారింది.
తాజావార్తలు
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!