NTV Telugu Site icon

KGF 2 : కెజిఎఫ్ 2 ఎఫెక్ట్.. వెడ్డింగ్ కార్డుపై వయలెన్స్ డైలాగ్

Kgf

Kgf

ఏదైనా ఒక సినిమా హిట్ అయితే కొన్నిరోజుల వరకు మ్యానియాలో ఉండిపోతారు అభిమానులు.. పుష్ప రిలీజ్ అయ్యాక తగ్గేదేలే, పార్టీలేదా పుష్ప అని మొదలుపెట్టారు.. ఆ తరువాత భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యాకా మనల్ని ఎవడ్రా ఆపేది అని స్టార్ట్ చేశారు.. ఇక ఆర్ఆర్ ఆర్ డైలాగ్స్ అయితే అసలు చెప్పనవసరం లేదు.. ఇక తాజాగా అభిమానులందరూ కెజిఎఫ్ 2 మ్యానియాలో పడ్డారు . ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యినప్పటినుంచి వయలెన్స్ డైలాగ్ ను వాడేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాకా ఆ అవాడకం ఇంకా పెరిగిందనే చెప్పాలి. సంజయ్ దత్ తో ఫైట్ తరువాత యష్..” వయలెన్స్‌.. వయలెన్స్‌.. వయలెన్స్‌.. ఐ డోంట్‌ లైక్‌ ఇట్‌.. బట్ వయలెన్స్‌ లైక్స్ మి.. ఐ కాంట్ అవైడ్ ఇట్” అని పవర్ ఫుల్ గా చెప్తాడు. ఈ డైలాగ్ కు థియేటర్లో ఈలలు మాములుగా పడలేదు. బయట కూడా ఏదైనా నచ్చక చేసే పని ఉంటే  అందరు ఈ డైలాగ్ ను ఉపయోగించేస్తున్నారు.. ఇక ఈ డైలాగ్ తో ఎన్ని మీమ్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక  తాజాగా ఒక యువకుడు ఏకంగా తన పెళ్లి కార్డులో కూడా ఈ డైలాగ్ వాడడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటకలోని బెళగావికి చెందిన చంద్రశేఖర్‌ అనే యువకుడు తన పెళ్లి కార్డులో చివరన .. “మ్యారేజ్‌.. మ్యారేజ్‌.. మ్యారేజ్‌.. ఐ డోంట్‌ లైక్‌ ఇట్‌. ఐ అవైడ్‌. బట్‌, మై రిలేటివ్స్‌ లైక్‌ మ్యారేజ్‌. ఐ కాంట్‌ అవైడ్‌.” అంటూ రాసుకొచ్చాడు. అంటే ఇన్ డైరెక్ట్ గా పెద్దల బలవంతంతో పెళ్ళికి ఒప్పుకోవాల్సివచ్చింది అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఓరి నీ దుంప తెగ ఇదెక్కడి వెడ్డింగ్ కార్డురా అని కొందరు.. నువ్వు దైర్యంగా చెప్పావ్ .. మేము చెప్పలేదు బ్రో అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.  ఏదిఏమైనా ఆగడు లో మహేష్ బాబు చెప్పినట్లు.. సినిమాల ప్రభావం జనాలపై ఎంత ఉందో తెలియదు కానీ పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం గట్టిగా ఉంది అని ఈ వెడ్డింగ్ కార్డు చూస్తుంటే తెలిసిపోతుంది.