యష్‌కు టాక్సిక్‌తో టెన్షన్ పెరుగుతోందని కన్నడ సినీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. రెండు ఏళ్లలో కేవలం 60% షూటింగ్ మాత్రమే పూర్తయింది. మొదట హైప్ ఎలా పెంచారో ఇప్పుడు అదే హైప్ వల్ల ప్రెజర్ డబుల్ అయింది. సినిమా బడ్జెట్ ₹600 కోట్లకు పెరిగింది, ఇంకా యష్ రెమ్యునరేషన్ అదనం. ప్రొడక్షన్‌లో సమస్యల పర్వం కొనసాగుతోంది. రద్దయిన షెడ్యూల్స్, రీషూట్స్, క్యాస్టింగ్ మార్పులు, క్రూ అసంతృప్తి, ఇవన్నీ ప్రాజెక్ట్‌ను స్లోమోడ్‌లోకి నెట్టాయి.
Also Read : Tollywood : తండ్రి కూతుళ్ళకు కలిసి రాని టాలీవుడ్.. కూతురి కోసం రంగంలోకి స్టార్ డైరెక్టర్
ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఏంటంటే యష్ స్వయంగా సినిమా డైరెక్షన్‌లో జోక్యం చేసుకున్నాడట. అసలు డైరెక్టర్ గీతూ మోహందాస్ ని సైడ్‌లైన్ చేశాడనే వార్త బలంగా వినిపిస్తోంది. ఈ కారణంగా ప్రొడక్షన్ స్పీడ్ మరింత తగ్గిపోయిందట.“KGF 2” తర్వాత నేషనల్ లెవెల్ ఐకాన్‌గా మారిన యష్ ఈ టాక్సిక్ సక్సెస్‌తో తన లెగసీని కన్‌ఫర్మ్ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ, అతిగా కంట్రోల్ చూపించడం వల్లే ప్రాజెక్ట్ డిలే అవుతున్నది అని విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమా ఫెయిల్ అయితే, యష్ స్టార్డమ్‌పై నేరుగా ఇంపాక్ట్ ఉంటుందనే భయం ఫ్యాన్స్‌లో ఉంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రస్తుతానికి యష్ హ్యాండ్‌లో రెండు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి టాక్సిక్, రెండోది రామాయణ. రామాయణ మల్టీ-స్టారర్ ప్రాజెక్ట్‌లో యష్ విలన్ రోల్, రావణ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. దీనివల్ల “టాక్సిక్ తేడా కొడితే యష్ బ్యాకప్ ప్లాన్ ఏంటి?” అనే చర్చ నడుస్తోంది. షూటింగ్ డిలేస్, పెరుగుతున్న బడ్జెట్ తో ఆందోళనలో ఉన్న హీరో, ఇవన్నీ కలిపి ‘టాక్సిక్’ టైటిల్ నిజంగా టాక్సిక్ ఫర్ ఎవ్రీవన్ అని కన్నడ ఫిలిం సర్కిల్స్‌లో టాక్ స్ప్రెడ్ అవుతోంది.