NTV Telugu Site icon

Salaar: సలార్ లో హీరో యష్… ఆ షాట్ తో లీక్?

The Sultan Kgf In Salaar

The Sultan Kgf In Salaar

Yash in salaar Movie revealed by this shot: సలార్ సినిమాలో యష్ నటిస్తున్నాడని వార్తలు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. సలార్ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపిస్తాడని ముందు నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుండగా ఇటీవల రిలీజైన ట్రైలర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో రిలీజ్ ట్రైలర్ పేరుతో మరో ట్రైలర్ రిలీజ్ చేయగా ఆ ట్రైలర్ లో యాక్షన్ సీన్స్, ప్రభాస్ ఎలివేషన్స్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉండేలా చూసుకున్నాడు డైరెక్టర్. ఇక ఎప్పటిలాగే ఈ ట్రైలర్ తో మళ్ళీ ఈ సినిమాకి సలార్ సినిమాకి కూడా కెజిఎఫ్ లింక్ ఉండేలా చేశాడు.

Eagle: మాస్ మహారాజా మాస్ ట్రీట్ కు ముహూర్తం ఖరారు

సలార్ లో యష్ కనిపిస్తాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుతుతోండగా ఆ ప్రచారం మరింత ఎక్కువయ్యేలా సలార్ సెకండ్ ట్రైలర్ లో ఒక హింట్ ఇచ్చాడు. ట్రైలర్ లో సుల్తాన్ అనే డైలాగ్ వచ్చినప్పుడు వెనుక నుంచి చూస్తే యష్ లాగే ఉన్న ఒక వ్యక్తి మెట్లు ఎక్కుతూ వెళుతున్న షాట్ పెట్టారు. అక్కడ వాకింగ్ స్టైల్ చూస్తే యష్ లాగే అనిపిస్తున్నాడు. ఇక ఆ షాట్ ను క్యాప్చర్ చేసి కెజిఎఫ్ లింక్ కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ హేస్తున్నారు. కెజిఎఫ్ లో కూడా యష్ ని సుల్తాన్ అంటూ కొన్ని చోట్ల పేర్కొన్నారు, మరీ ముఖ్యంగా సుల్తాన్ అనే పాట కూడా ఉంది. దీంతో ఇప్పుడు సలార్, కెజిఎఫ్ మల్టీవర్స్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. అయితే నిజంగా యష్ సలార్ సినిమాలో ఉంటాడా? లేదా? అనేది సినిమా రిలీజ్ అయితే కానీ చెప్పలేం.