NTV Telugu Site icon

NBK108: బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!

108

108

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. పాజిటివ్ ఎనర్జీతో తొలి షెడ్యూల్ పూర్తి చేస్తూ, ఈ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతున్నట్టు అనిల్ చెప్పారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణకు, చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్ ద్వితీయార్థంలో ‘ఎన్.బి.కె. 108’ మూవీ షూటింగ్ ను యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ వి. నేతృత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణతో మొదలు పెట్టారు. దీని కోసం ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఓ భారీ సెట్ ను వేశారు. శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో ‘ధమాకా’తో సూపర్ హిట్ ను తన కిట్ లో వేసుకున్న శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.
Nbk108
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ మూవీకి సంగీతం అందిస్తున్న ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికీ స్వరాలు సమకూర్చుతున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 31 చిత్ర నిర్మాతల్లో ఒకరైన హరీశ్ పెద్ది పుట్టినరోజు కూడా కావడం విశేషం. ఈ సినిమాకు సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, తమ్మి రాజు ఎడిటర్ గా బాధ్యతలను నిర్వరిస్తున్నారు. నందమూరి బాలకృష్ణతో వర్క్ చేసే అవకాశాన్ని తొలిసారి అందుకున్న అనిల్ రావిపూడి ఓ పవర్ ఫుల్ కథను ఆయన కోసం తయారు చేశాడు. విశేషం ఏమంటే… రైటర్ గా చక్కని గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి కెరీర్ దర్శకుడిగా నందమూరి కళ్యాణ్ రామ్ ‘పటాస్’ మూవీతో మొదలైంది.

Show comments