రవితేజ కమర్షియల్ హీరోగా మారాక.. సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టడం ఓ అలవాటుగా చేసుకున్నాడు. రాను రానూ అది ఓ సెంటిమెంటై కూర్చొంది. చిరు అన్నయ్య మూవీ నుండే ఇది మొదలైంది. 2003 మినహా మిగిలిన పొంగల్ కు బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొడుతూనే ఉన్నాడు. 2008లో పొంగల్ బరిలోకి దిగిన కృష్ణ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 8 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి11న రిలీజై 25 కోట్లను వసూలు చేసింది. 2010లో రవితేజ, నరేష్ , శివ బాలాజీ నటించిన శంభో శివ శంభో హిట్ నమోదు చేసింది.
Also Read : MSG : మనశంకర వరప్రసాద్ ఓవర్సీస్ రివ్యూ.. అనిల్ రావిపూడి దొరికేశాడా.?
2011లో వచ్చిన మిరపకాయ్ రవితేజ కెరీర్‌కు టర్నింగ్ ఇచ్చిన ఫిల్మ్. ఈ సినిమాతో మాస్ మహారాజ్ ట్యాగ్ స్థిరపడిపోయింది. 2021లో సంక్రాంతి బరిలో దిగిన క్రాక్ కూడా సూపర్ హిట్ నమోదు చేసింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి 2023లో పొంగల్‌కు వచ్చిన వాల్తేరు వీరయ్య కమర్షియల్ సక్సెస్ అందుకుంది. నెక్ట్స్ భర్త మహాశయులకు విజ్ఞప్తితో ఈ సంక్రాంతికి హిట్ నమోదు చేసేందుకు గట్టిగానే కష్టపడుతున్నాడు. ఇద్దరు భామలు డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్‌తో కలిసి ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. ధమాకా తర్వాత సరైన హిట్స్ లేని రవితేజకు ఈ సంక్రాంతికి హిట్ కొట్టడం చాలా ముఖ్యం. పొంగల్‌కు విపరీతమైన కాంపిటీషన్ ఉందని తెలిసి కూడా రిస్క్ చేసి బరిలోకి దిగుతున్నాడు శర్వానంద్. 2016లో సంక్రాంతికి వచ్చిన ఎక్స్ ప్రెస్ రాజా హిట్టుగా నిలిస్తే.. 2017లో పొంగల్‌కు రిలీజైన శతమానం భవతి బ్లాక్ బస్టర్ హిట్. సో ఈ లెక్కన చూస్తే.. శర్వానంద్ కి కూడా సంక్రాంతి ఓ సెంటిమెంట్ అయ్యింది. అందుకే ఫుల్ కాంపిటీషన్ ఉన్నా.. ఈ ఫెస్టివల్ సీజన్ వదులుకోలేకపోతున్నాడు. శర్వా.. నారీ నారీ నడుమ మురారి అంటూ సంయుక్త మీనన్, సాక్షి వైద్యలతో సందడి చేయబోతున్నాడు. మనమేతో ఫ్లాప్‌తో సక్సెస్ ట్రాక్ తప్పిన శర్వాకు ఈ హిట్ చాలా కీలకం.
రవితేజ, శర్వానంద్‌లా మీనాక్షి చౌదరి కి కూడా పొంగల్ సెంటిమెంట్ అయ్యింది. 2024లో వచ్చిన గుంటూరు కారం, 2025లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంతో బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతులకు సాలిడ్ హిట్స్ నమోదు చేసిన మీనాక్షి.. 2026 సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో హిట్ కొట్టి.. హ్యాట్రిక్ నమోదు చేయాలనుకుంటోంది. మేడమ్ కూడా ఎప్పుడూ టచ్ చేయని కామెడీ పండించబోతోంది. నవీన్ పోలిశెట్టితో కలిసి వస్తున్న ఈ భామ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేనా.
