ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకలో ఓ స్టార్ హీరో చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆస్కార్ 2022 లైవ్ వేడుకలో విల్ స్మిత్ వేదిక పైకి వెళ్లి హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్రిస్ రాక్ కు స్ట్రాంగ్ పంచ్ ఇచ్చాడు. విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్ గుండు గురించి క్రిస్ రాక్ జోక్ చేశాడు. క్రిస్ రాక్ 94వ అకాడమీ అవార్డుల సమర్పకులలో ఒకరు. ఒక అవార్డును ప్రజెంట్ చేస్తున్నప్పుడు అతను విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్ GI జేన్ 2 లాగా ఉందని జోక్ చేసాడు. ఇలాంటి అతిపెద్ద వేదికపై తన భార్యపై కామెంట్స్ చేయడం నచ్చని హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ కోపంతో క్రిస్ చెంప చెళ్లుమన్పించాడు.
Read Also : RRR : ఎన్టీఆర్ నిజంగా హర్ట్ అయ్యాడా!?
94వ అకాడమీ అవార్డుల వేడుకలో అప్పటిదాకా నవ్వుతూ ఉన్న సినీ ప్రముఖులు, అభిమానులు ఈ అనుకోని పరిణామాన్ని చూసి షాక్ అయ్యారు. ఈ షాకింగ్ ఘటన కారణంగా Disney+ Hotstarలో ఆస్కార్స్ ప్రత్యక్ష ప్రసారం కొంత సమయం ఆగిపోయింది. అయితే ఈ సంఘటన స్క్రిప్ట్ ప్రకారం జరిగిందా? లేదా నిజమా ? అని కొందరు ఆలోచనలో పడ్డారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఈ ఘటన నిజంగానే జరిగింది. విల్ స్మిత్, జాడా పింకెట్ స్మిత్ 1997లో పెళ్లి చేసుకున్నారు. 2018లో జాడా పింకెట్ స్మిత్ తనకు అలోపేసియా అనే వ్యాధితో పోరాడుతున్నట్టు వెల్లడించారు. ఈ వ్యాధి కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.
Will Smith punches Chris Rock at the #Oscars.
— Pop Base (@PopBase) March 28, 2022
“Keep my wife’s name out of your fucking mouth”
https://t.co/rS9wZ10d2V