NTV Telugu Site icon

Sara Arjun: సారా అర్జున్‌కు స్టార్ డమ్ దక్కుతుందా?

Sara Arjun

Sara Arjun

Sara Arjun: సారా అర్జున్ పేరు వినగానే విక్రమ్ ‘నాన్న’ సినిమాలో నటించిన ముద్దుమోము గుర్తు రాక మానదు. 2011లో ఆ సినిమా వచ్చినపుడు సారా వయసు 6 సంవత్సరాలు. తాజాగా మణిరత్నం హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’లో యుక్తవయసులో ఐశ్వర్యారాయ్ బచ్చన్‌గా నటించి మెప్పించింది. ఈ 17 ఏళ్ల యంగ్ బ్యూటీ తన ఉనికిని చాటుకుని యువత హృదయాలను కొల్లగొడుతోంది. ‘పొన్నియన్ సెల్వన్1’లో విక్రమ్ ఫ్లాష్‌బ్యాక్‌ వివరిస్తున్నప్పుడు సారా కొద్ది సమయమే కనిపించినప్పటికీ, తన అందమైన లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసింది. 2005లో జన్మించిన సారా తెలుగులో ‘దాగుడుమూత దండాకోర్’, బాలీవుడ్ లో ‘జై హో’, ‘ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా’, ‘తులసీదాస్ జూనియర్’ వంటి సినిమాలతో పాటు తమిళంలో, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కూడా నటించింది. త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. తెరపై చిన్న పాత్రలో తళుక్కుమన్నా కూడా చెరగని ముద్ర వేసిన సారా హీరోయిన్ గానూ సత్తా చాటుతుందేమో చూడాలి.

Read Also: Hunt Teaser: ఆకట్టుకుంటున్న సుధీర్ బాబు ‘హంట్’ టీజర్

Show comments