Site icon NTV Telugu

Roshan : సీనియర్ హీరో తనయుడి పేరు చేంజ్… కలసి వస్తుందా ?

roshan meka

స్టార్ పిల్లలు సినిమా పరిశ్రమలోకి సులభంగా ప్రవేశిస్తారనే టాక్ ఇప్పటికీ ఉంది. అయితే ఎంట్రీ సులభమే అయినప్పటికీ, ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు. చాలా మంది స్టార్ కిడ్స్ తమ తల్లిదండ్రులలాగా స్టార్స్ అవ్వకపోవడానికి కారణం ఇదే. నిర్మలా కాన్వెంట్, పెళ్లిసందడి వంటి సినిమాలతో బాలనటుడిగా, హీరోగా రెండు సార్లు టాలీవుడ్ రంగప్రవేశం చేసిన సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే తాజాగా ఈ యంగ్ హీరో తన పేరు స్పెల్లింగ్‌ను “Roshann” గా మార్చుకున్నాడు. న్యూమరాలజీ ప్రకారం అదనపు ‘n’ని జోడించాడు.

Read Also : Balakrishna’s Next : అనిల్ రావిపూడి అప్డేట్… ఎంత వరకు వచ్చిందంటే ?

ఇంతకుముందు తమన్నా, యాంకర్ ఓంకార్ కూడా ఇలాగే చేశారు. వీరిద్దరికీ అలా పేరు మార్చుకోవడం కలిసి వచ్చిందనే చెప్పాలి. కానీ ఇండస్ట్రీలోని కొందరు సెలెబ్రెటీలకు మాత్రం పేరు మార్చినా ఏమాత్రం ఫలితం కన్పించలేదు. ఇక మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన పేరు నుండి ‘ధరమ్’ని తీసివేయగా, అతని సోదరుడు వైష్ణవ్‌కి అదనపు ‘h’ జోడించారు. కానీ వైష్ణవ తొలి చిత్రం ‘కొండ పోలం’తో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మరి అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రోషన్ తన కొత్త సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇక ఈ పేరు మార్పు రోషన్ కు కలిసి వస్తుందా ? లేదా ? అన్నది కూడా ఈ చిత్రంతో తేలిపోనుంది.

Exit mobile version