Site icon NTV Telugu

HHVM : ప్రీ రిలీజ్ ఈవెంట్ కు క్రిష్ వస్తాడా..?

Keish

Keish

HHVM : పవన్ కల్యాణ్‌ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీ చాలా ఏళ్ల తర్వాత వస్తుండటంతో దీని గురించే చర్చ జరుగుతోంది. జులై 20న ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. దాని డేట్ మారొచ్చనే వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. అయితే ఈవెంట్ కు డైరెక్టర్ క్రిష్ వస్తాడా రాడా అనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీకి మొదటి డైరెక్టర్ క్రిష్. ఈ సినిమాను ఆయనే మేజర్ భాగం షూట్ కంప్లీట్ చేశాడు. ఇంపార్టెంట్ సీన్లు అన్నీ క్రిష్‌ డైరెక్ట్ చేసినవే. మధ్యలో తప్పుకున్నాడు. ఇప్పుడు ఫైనల్ ఔట్ పుట్ రావడంలో క్రిష్‌ చాలా సాయం చేస్తున్నాడు.

Read Also : Prasad Babu : నా కొడుకు చనిపోవాలని కోరుకున్నా.. సీనియర్ హీరో షాకింగ్ కామెంట్స్

అయితే ప్రమోషన్లకు మాత్రం చాలా దూరంగా ఉంటున్నాడు. తనకు సంబంధం లేదు అన్నట్టే మౌనంగా ఉంటున్న క్రిష్‌.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తారా రారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అనుష్కతో చేసిన ఘాటీ మూవీ పనుల్లో చాలా బిజీగా ఉంటున్నాడు క్రిష్. అలాగే మూవీ నుంచి మధ్యలో తప్పుకున్న పరిస్థితులు సానుకూలంగా లేవు. కాబట్టి ఈవెంట్ కు రాకపోవచ్చు అనే వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Read Also : Allu Arjun : ప్రభాస్ దారిలో వెళ్తున్న అల్లు అర్జున్..?

Exit mobile version