Site icon NTV Telugu

Yatra 2: ‘యాత్ర2’కి దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా!?

Ysr

Ysr

Yatra 2: 2019లో వైయస్సార్‌సీపీ గెలుపులో వైయస్ఆర్ పాదయాత్ర బేస్ గా రూపొందిన ‘యాత్ర’ సినిమా కీలక పాత్రపోషించిన సంగతి తెలిసిందే. మహి వి రాఘవ దర్శకత్వంలో విజయ్ చిల్లా నిర్మించిన ఈ చిత్రంలో మమ్ముట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో ఒదిగి పోయారు. 70 ఎం.ఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా కమర్షియల్‌గానూ ఘన విజయం సాధించటం విశేషం. ఆ తర్వాత ‘యాత్ర2’ రూపొందనుందని పలుమార్లు వినిపించినా ఎందుకో ఏమో కార్యరూపం దాల్చలేదు. అయితే వచ్చే ఏడాది మళ్ళీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి ‘యాత్ర2’ వార్తలలోకి వచ్చింది.

Nikhat Zareen Dance: సల్మాన్‌తో బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ డ్యాన్స్‌.. స్టెప్పులు అదరగొట్టేసింది..

ఈసారి వైయస్ఆర్ మరణం నుంచి వైయస్ జగన్ అధికారం చేపట్టే వరకూ జగన్ పాదయాత్రలతో వైయస్సార్‌సీపీకి అనుకూలంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు వినిపిస్తోంది. ఇక ఇందులో వైయస్ జగన్ గా దుల్కర్ సల్మాన్ ను నటింపచేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తను పోషించే పాత్రలోకి ఒదిగిపోయే దుల్కర్ అయితే దీనికి న్యాయం జరుగుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ‘మహానటి’లో జెమినీ గణేశన్ పాత్రతో, ఇటీవల విడుదలైన ‘సీతారామం’తో తెలుగువారి మది దోచిన నటుడు దుల్కర్. దుల్కర్ ఓకే అంటే తను అడిగిన పారితోషికం ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారట. ఒకవేళ దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే నిజజీవితంలో తండ్రీ కొడుకులైన మమ్ముట్టి, దుల్కర్ ఎపికి సిఎమ్ లుగా చేసిన తండ్రీ కొడుకులైన వైయస్ఆర్, జగన్ పాత్రలను పోషించినట్లు అవుతుంది. ఇది నిజంగా అరుదైన విషయం అవుతుంది. మరి దుల్కర్ ‘యాత్ర2’కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా!? లెట్స్ వెయిట్ అండ్ సీ.

Exit mobile version