Animal: యానిమల్ రివ్యూ ఇవ్వడానికి టాలీవుడ్ భయపడుతుందా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Animal: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1 న ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. వైలెన్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. గత ఐదు రోజులుగా ఈ సినిమా గురించి నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. ఇక ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. చాలామంది ఈ సినిమా గురించి మాట్లాడుతున్నా కూడా టాలీవుడ్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ రూపురేఖలు మార్చాడు. ఇలా బాలీవుడ్ ను షేక్ చేసిన ఒక తెలుగు డైరెక్టర్.. ఇంత సక్సెస్ ను అందుకున్నా కూడా టాలీవుడ్ మాత్రం నోరు ఎత్తలేదు. చివరికి.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన మహేష్ బాబు, రాజమౌళి కూడా సినిమా గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు.
ఒక సినిమా రిలీజ్ అయితే.. అది కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సెలబ్రిటీలు మొత్తం ఆ సినిమా తీసిన విధానాన్ని గురించి ప్రశంసిస్తూ ట్వీట్స్ చేస్తారు. ఇక కొందరు అయితే ఏకంగా సక్సెస్ మీట్స్ నిర్వహించి మరీ వారిని ప్రశంసిస్తున్నారు. కానీ, ఇప్పటివరకు యానిమల్ గురించి ఒక్క తెలుగు సెలబ్రిటీ కూడా ట్వీట్ చేసింది లేదు. ఎందుకు వీరు ట్వీట్ చేయడం లేదు.. భయపడుతున్నారు అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే త్రిష.. యానిమల్ పోస్టర్ పెట్టి సూపర్ అంటేనే.. ఆమెను ఏకిపారేశారు. అలాంటి సినిమాను సపోర్ట్ చేస్తావా.. ? అంటూ విరుచుకుపడ్డారు. ఇక ఇప్పుడు మిగతా స్టార్లు కూడా ఇలాంటి వైలెన్స్, రొమాన్స్, న్యూడిటీ ఉన్న సినిమా గురించి మాట్లాడితే.. ఆ ట్రోలింగ్ తమపై ఎక్కడ పడుతుందో అని చేయడం లేదా.. ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఒక తెలుగు డైరెక్టర్.. మూస ధోరణిలో వచ్చే సినిమాలా కాకుండా.. వైవిధ్యమైన సినిమా.. అది కూడా బాలీవుడ్ మెచ్చిన సినిమా తీస్తే.. కనీసం ఒక్క ప్రశంస కూడా దక్కలేదు అనేది వాస్తవం. సినిమా లో ఏ అంశం నచ్చినా నచ్చకపోయినా సందీప్ ట్రై చేసాడు అని కూడా ట్వీట్ చేయలేకపోతున్నారా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ చెప్పినట్లు ఈ సినిమా ఎంతోమంది నిర్మాతలకు, డైరెక్టర్ లకు సినిమా అంటే ఇలాగే వుండాలని అనుకునే డైరెక్టర్లందరికీ ఫ్యూజులు ఎగిరిపోయేలా ఒక ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాడు సందీప్.. వాళ్ళు నమ్మే చాదస్తపు నైతిక విలువులన్నింటినీ తన చీపురు కట్టతో ఊడ్చి ఎత్తి చెత్త కుండీలో పడేసాడు. ఒకవేళ వారు పోస్ట్ పెడితే.. ఎక్కడ ఫ్యాన్స్ మీరు ఇలాంటి సినిమాలు తీయండి అని అడుగుతారేమో అని భయపడుతున్నారా.. ? అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!