Kota Srinivas Death : విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ కన్నుమూశారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాస రావుకు సంబంధించిన అనేక విషయాలు తెరమీదకు వస్తున్నాయి. కోట శ్రీనివాస్ నటనతోనే కాకుండా రాజకీయాల్లోనూ సత్తా చాటారు. 1999లో కోట రాజకీయ తెరంగేట్రం చేశారు. అప్పటికి ఊపులో ఉన్న కాంగ్రెస్, టీడీపీని కాదని.. బీజేపీలోకి వెళ్లారు. విద్యాసాగర్ రావు ప్రోత్సహించడంతో బీజేపీ తరఫున 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మంచి వాక్చాతుర్యం ఉన్న కోట శ్రీనివాస్ ఇక రాజకీయాల్లోనే ఉండిపోతారని అంతా అనుకున్నారు.
Read Also : Chandrababu : నటన అంటే ఏంటో చూపించాడు.. సీఎం చంద్రబాబు నివాళి..
కానీ ఆ తర్వాత ఎన్నికల్లో కోట ఓడిపోయారు. దాంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి సినిమాల్లోకి వచ్చారు. సినిమాల్లోనే చివరిదాకా కొనసాగారు. కోట శ్రీనివాస్ రాజకీయాలను వదిలేయడానికి కారణం కూడా బయట పెట్టారు. రాజకీయాల్లో ఉండే పరిస్థితులు తనకు నచ్చకనే వదిలేశానని తెలిపారు. రాజకీయాల్లో ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో తాను వెళ్తే.. అక్కడ ఆ పరిస్థితి లేదని.. ప్రతి ఎన్నికకు రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల దాకా ఖర్చు చేయాలనే పరిస్థితులు ఉండటంతో వాటికి తాను సరిపోను అని బయటకు వచ్చేసినట్టు తెలిపారు కోట శ్రీనివాస్.
Read Also : Kota Srinivas Death : నటనతో ఇండస్ట్రీ ఉలిక్కిపడేలా చేశాడు.. ఆర్.నారాయణ మూర్తి కామెంట్స్
