OG : పవన్ కల్యాణ్ ఏ సినిమా చేసిన దాని వెనకాల డైరెక్టర్ త్రివిక్రమ్ ఉంటాడు. అందులో నో డౌట్. ఆ సినిమాకు స్వయంగా తాను డైరెక్టర్ కాకపోయినా.. కనీసం పర్యవేక్షణ బాధ్యతలు అయినా తీసుకుంటాడు. అలాగే సినిమాను ప్రమోట్ చేయడం, ఈవెంట్లకు వచ్చి మాట్లాడటం లాంటివి చేస్తుంటాడు గురూజీ. కానీ ఓజీ సినిమా విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు త్రివిక్రమ్. ఈ సినిమా విషయంలో ఎక్కడా కనిపించలేదు. ఈవెంట్ కు రాలేదు. బయట ఎక్కడా ఓజీ గురించి మాట్లాడకుండా దూరం మెయింటేన్ చేస్తున్నాడు. మరి త్రివిక్రమ్ ఇలా ఎందుకు ఉంటున్నాడు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Read Also : OG : అదే జరిగితే సుజీత్ కు బలమైన అండ దొరికినట్టే..
ఎందుకంటే సుజీత్ తో సినిమా చేయమని సలహా ఇచ్చింది త్రివిక్రమే. మరి అలాంటప్పుడు ఈ మూవీ విషయంలో ఏదో ఒక రకంగా హైలెట్ అయ్యేందుకు ప్రయత్నిస్తాడు కదా. కానీ అలా చేయలేదు. ఎందుకంటే గతంలో ఇలా కొన్ని సినిమాల విషయాల్లో జోక్యం చేసుకుని అభాసుపాలయ్యాడు. పవన్ ఫ్యాన్స్ అతి దారుణంగా గురూజీని తిట్టిపోశారు. అందుకే ఓజీ విషయంలో మౌనమే బెటర్ అనుకున్నాడు. ఓజీ హిట్ అయితే అప్పుడు బయటకు వచ్చి మాట్లాడొచ్చు అనుకుంటున్నాడు. ఒకవేళ తేడా కొడితే ఆ నెగెటివిటీ తన మీదకు రావొద్దని గురూజీ భావిస్తున్నాడు. రేపు రిజల్ట్ ను బట్టి త్రివిక్రమ్ వ్యూహాలు ఉండొచ్చు.
Read Also : OG : పవన్ కల్యాణ్, సుజీత్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే..?
