ఇకపై ‘జబర్దస్త్’ లో సుడిగాలి సుధీర్ పంచ్ లు చూడలేమా? ఈ ప్రోగ్రామ్ నుంచి సుధీర్ తప్పుకున్నాడా? లేక తప్పించారా? అసలు జబర్ దస్త్ ఒక్ ప్రోగ్రామ్ లోనేనా? లేక ఎక్స్ ట్రా జబర్ దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రోగ్రామ్స్ లో కూడా సుధీర్ ఉండటం లేదా? సుధీర్ ప్లేస్ ను ఎవరితో రీప్లే చేస్తున్నారు. సుధీర్ లేకుండా వాటికి ఆదరణ లభిస్తుందా? వీటన్నింటికి సమాధానం నిజమే సుధీర్ వాటిలో ఉండటం లేదు అన్నదే. ఈ సూపర్‌హిట్ ప్రోగ్రామ్‌ల తాజా ఎపిసోడ్‌లు సుడిగాలి సుధీర్ లేక పోవడం వల్ల ఆడియన్స్ కు నిరాశ కలిగించక మానవు. ఇటీవల ఢీ డ్యాన్స్ షో తాజా సీజన్‌లో సుధీర్ స్థానంలో గత సంవత్సరం బిగ్ బాస్ రన్నరప్ అఖిల్ సార్దక్ తో రీప్లేస్ చేశారు. హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్ మాత్రం కంటిన్యూ అవుతున్నారు. నిజానికి టీమ్ కెప్టెన్‌గా సుధీర్ లేకుండా ఢీ షోను ఊహించడం కష్టమే.
Read Also : ఏది పడితే అది తీస్తే పాన్ ఇండియా అవ్వదు : రాజమౌళి
అలాగే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ తాజా స్కిట్‌లు కూడా సుధీర్‌ను మిస్ అవుతున్నాయి. గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ మాత్రమే చేస్తున్నారు. అంతేకాదు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అఖిల్ సార్థక్ నే ఉన్నాడు. సుధీర్ తన బల్క్ డేట్స్ ను ఓ సినిమాకు ఇచ్చాడని అందుకే ఈ ప్రోగ్రామ్ లకు హాజరు కావటం లేదంటున్నారు. కానీ మరి కొందరు మాత్రం ఈ షో మేకర్స్‌తో సుధీర్ కి అభిప్రాయభేదాలు వచ్చాయని, అందుకే ఆ ప్రోగ్రామ్‌లలో ఎక్కడా సుధీర్ కనిపించడం లేదని పుకార్లు వినిపిస్తున్నాయి. గతంలో ఇలాగే నాగబాబు, శేఖర్ మాస్టర్ మరి కొంత మంది కూడా ఇలాగే ‘జబర్ దస్త్’ ప్రోగ్రామ్ నుండి విడిపోయి విడిగా ‘అదిరింది’పేరుతో షో చేశారు. కానీ సక్సెస్ కాలేక పోయారు. ఇప్పుడు సుధీర్ లేని ఈ ప్రోగ్రామ్ లకు జనాదరణ ఉంటుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.