Prabhas: ఇక ప్రభాస్ తో హిట్ జోడీ అనిపించుకునేది ఎవరో!?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాబోయే సినిమాల లైన్ అప్ పై ఓ లుక్ వేస్తే పలు ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా తోటి స్టార్ హీరోలకు భిన్నంగా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ప్రభాస్. ‘ఈశ్వర్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కెరీర్ గమనిస్తే హీరోయిన్ల విషయంలో పర్టిక్యులర్ గా ఉన్నాడనేది ఇట్టే అర్థమౌతుంది. ఇప్పటి వరకూ ప్రభాస్ దాదాపు 25 సినిమాలు చేశాడు. అందులో రిపీట్ అయిన హీరోయిన్లను వేళ్ళ మీదే లెక్కపెట్టొచ్చు. వారిలో అత్యధికంగా అనుష్కతో ప్రభాస్ నాలుగు సార్లు స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ‘బిల్లా’తో వీరిద్దరి కలయిక మొదలైంది. ‘బాహుబలి’ వరకూ నాన్ స్టాప్ గా కొనసాగింది. ‘మిర్చి’లో వీరి జోడీ ఫ్యాన్స్ లో రకరకాల ఆలోచనలకు తావిచ్చింది. అనుష్క తర్వాత ప్రభాస్ తో ఎక్కువ సార్లు స్క్రీన్ షేర్ చేసుకున్నతార త్రిష. ‘వర్షం’, ‘పౌర్ణమి’, ‘బుజ్జిగాడు’ సినిమాల్లో వీరిద్దరూ అలరించారు. ‘వర్షం’ తప్ప మిగిలిన రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోవడంతో ఆపై ఈ జోడీ రిపీట్ కాలేదు. ప్రభాస్ సరసన రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఘనత కాజల్ ది.
‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ ఫెక్ట్’లో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ రెండు సినిమాలూ హిట్ అనిపించుకున్నా ఎందుకో ఏమో ఆ తర్వాత వీళ్ళు కలిసి నటించలేదు. ‘బాహుబలి’ వరకూ హీరోయిన్లను రిపీట్ చేస్తూ వచ్చిన ప్రభాస్ ఆపై ఎందుకో ససేమిరా అంటున్నాడు. ‘సాహో’ నుండి కొత్త తారలతో జోడీ కట్టడానికే ఇష్టపడుతున్నాడు. అందుకు పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ఉండటం ఓ కారణంగా భావించవచ్చు. ‘సాహో’లో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ నటించగా ఆ తర్వాత వచ్చిన ‘రాధేశ్యామ్’లో పూజా హెగ్డే స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక తాజా చిత్రం ‘ఆదిపురుష్’లో కృతీ సనన్ నటించింది. సెట్స్ పై ఉన్న ‘సలార్’లో శృతీ హాసన్ నాయిక కాగా, ‘ప్రాజెక్ట్ కె’లో దీపికా పదుకొనే, మారుతీ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ నటిస్తున్నారు. ప్రభాస్ 25వ చిత్రం `స్పిరిట్`లో కూడా బాలీవుడ్ హీరోయిన్ నటించవచ్చని వినిపిస్తోంది. అంటే వరుసగా ఏడు సినిమాల్లో ప్రభాస్ హీరోయిన్లుగా కొత్తవారే నటిస్తున్నారు. ఏ హీరోయిన్ రిపీట్ కావటం లేదు. ‘బాహుబలి’ తర్వాత ఘన విజయం లేని ప్రభాస్ కి ఏ కొత్త హీరోయిన్ కాంబో సూపర్ హిట్ అందిస్తుందో చూడాలి.
Also Read
- Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
- NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..
- Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
- Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!