Site icon NTV Telugu

Unstoppable 2: బాలయ్యతో కలసి ‘అన్ స్టాపబుల్’గా సందడి చేసేదెవరో!

Bala

Bala

Unstoppable 2: ఇదేమి చిత్రంరా బాబూ…అన్న రీతిలో నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 కూడా సాగుతోంది. ఈ రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ లోనే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ కనిపించి సందడి చేశారు. అదే ఓ హిస్టరీ అనుకుంటే, రెండో ఎపిసోడ్ ప్రోమోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ ప్రోమోలో బాలయ్యతో పాటు యంగ్ హీరోస్ విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ పాల్గొన్నారు. వారితో బాలయ్య మాటల ఆట భలేగా సాగింది. దాంతో ప్రోమో రెండు రోజుల్లోనే నాలుగు మిలియన్ల వ్యూస్ సంపాదించడం చర్చనీయాంశమయింది. ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 21న ఈ రెండో ఎపిసోడ్ జనం ముందుకు రానుంది. ఈ ఎపిసోడ్ సందడి సందడిగా సాగుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

ఎందుకంటే ప్రోమోతోనే అది రుచి చూసి ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే, మూడో ఎపిసోడ్ లో యంగ్ హీరోస్ శర్వానంద్, అడివి శేష్ బాలకృష్ణతో కలసి చిందేయబోతున్నారట. దీని తర్వాత నాలుగో ఎపిసోడ్ లో ఒకప్పటి బాలయ్య హిట్ పెయిర్, నేటి తరాన్ని ‘శివగామి’గా అలరించిన రమ్యకృష్ణ రాబోతున్నట్లు వినికిడి. ఈ సీజన్ లోనే త్రివిక్రమ్ కూడా షోలో పాల్గొనబోతున్నట్టు రెండో ఎపిసోడ్ ప్రోమోలోనే తెలిసిపోయింది. ఇలా ప్రతి ఎపిసోడ్ లో ఓ స్పెషల్ కాంబోతో అలరించే ప్రయత్నం చేస్తున్నారు ‘అన్ స్టాపబుల్’ నిర్వాహకులు. అందుకు తగ్గట్టుగానే బాలయ్య సైతం తనను తాను మరింత యూత్ గా మలచుకుంటూ సాగుతూ ఉన్నారు. మొదటి సీజన్ ను మించిన స్థాయిలో ఈ రెండో సీజన్ వీక్షకుల మన్ననలు పొందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version