Site icon NTV Telugu

Balakrishna : బాలయ్యతో గోపీ చంద్ .. అంతా సెట్ కానీ?

Balakrishna

Balakrishna

Balakrishna :వరుస హిట్లతో జోరుమీదున్నారు నందమూరి బాలకృష్ణ. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం అఖండ-2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత గోపీచంద్ మలినేనితో మరో సినిమా ఉండబోతోంది. ఆ మూవీ జూన్ లో స్టార్ట్ అవుతుందని ఇప్పటికే డైరెక్టర్ గోపీచంద్ ప్రకటించారు. ఈ సినిమాకు అన్నీ సెట్ అయ్యాయి కానీ.. నిర్మాత ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. వృద్ధి సినిమాస్ తో ఎంట్రీ ఇచ్చిన సతీష్‌ కిలారు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈయన ప్రస్తుతం రామ్ చరణ్‌-బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Read Also: Tablet: మేడిన్‌ ఇండియా ‘ట్యాబ్‌’.. కిందపడేసి తొక్కినా పగలదు!

అలాగే షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి పేరు కూడా వినిపిస్తోంది. బాలకృష్ణతో ఈయన భగవంత్ కేసరి సినిమాను నిర్మించారు. ఆ మూవీ మంచి హిట్ అయింది. సుధాకర్ చెరుకూరి పేరు లిస్టులో ఉంది. ఈయన దసరా సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరితో గతంలో బాలయ్య సినిమాలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ తో మిక్స్ అయిన వృద్ధి సినిమాస్ పేరు ఎక్కువగా ప్రచారంలో ఉంది. మైత్రీతో బాలయ్యకు, గోపీచంద్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో వృద్ధికి ఓకే చెబుతారా లేదంటే.. మిగతా వారిలో ఎవరితో అయినా మూవీ చేస్తారా అన్నది చూడాలి.

Exit mobile version