బాలీవుడ్ కష్టాలకి ఎండ్ కార్డ్ వేసే సినిమాగా పేరు తెచ్చుకున్న మూవీ ‘పఠాన్’. షారుఖ్ ఖాన్, దీపిక పదుకోణే, జాన్ అబ్రహం మెయిన్ లీడ్స్ ప్లే చేస్తున్న ఈ హై ఆక్టేన్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీతో షారుఖ్ సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని, బాక్సాఫీస్ దగ్గర ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తాడని బీటౌన్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ఇదే సమయంలో బాయ్కాట్ బాలీవుడ్ అనే ట్రెండ్ పఠాన్ సినిమాపై ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అనే భయం ట్రేడ్ వర్గాల్లో ఉంది. గత కొంతకాలంగా బాలీవుడ్ ని కోలుకోలేని దెబ్బ కొడుతుంది ఈ బాయ్కాట్ ట్రెండ్. పఠాన్ మూవీ ప్రీబుకింగ్స్ చూస్తుంటే ఈ నెగటివ్ ట్రెండ్ సినిమాపై పెద్దగా ఇంపాక్ట్ చూపిస్తున్నట్లు లేదు కానీ రిలీజ్ డేట్ రోజున సినిమాలో వెతికి మరీ నెగటివ్ పాయింట్స్ ని టార్గెట్ చేసి గొడవ చేస్తే బాలీవుడ్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరే ఛాన్స్ ఉంది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో “Who is SRK?” అనే ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ వ్యతిరేక వర్గం ఈ ట్యాగ్ ని నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తూ ట్వీట్స్ వేస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఎవరు అని కొంతమంది కావాలనే నెగటివ్ ట్రెండ్ చేస్తున్నారు కానీ నిజం మాట్లాడుకుంటే ఇండియాలో షారుఖ్ ఖాన్ తెలియని వాళ్లు ఉండరు. ఇండియాలోనే కాదు ఈస్ట్రన్ అండ్ వెస్ట్రన్ కంట్రీస్ లో షారుఖ్ ఖాన్ అనే పేరే ఒక బ్రాండ్. దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా, ఎంతోమంది వెస్ట్రన్ ఆడియన్స్ కి హిందీ సినిమాని పరిచయం చేసిన హీరోగా షారుఖ్ ఖాన్ హిస్టరీ క్రియేట్ చేశాడు. కొన్ని లక్షల మంది షారుఖ్ సినిమాలు చూసిన తర్వాతే ఇండియన్ సినిమాలు చూడడం మొదలుపెట్టారు అంటే అతిశయోక్తి కాదు. షారుఖ్ ఇళ్లు “మన్నత్’ ముందు నిలబడితే తెలుస్తుంది షారుఖ్ అంటే ఎవరు అని? అక్కడకి షారుఖ్ ని చూడడానికి వచ్చే డై హార్డ్ ఫాన్స్ ని అడిగితే తెలుస్తుంది షారుఖ్ ఖాన్ అంటే ఎవరు? సినిమాపై కోపం ఉంటే ఆ సినిమాపై చూపించాలి కానీ ఇలా షారుఖ్ ఖాన్ అంటే ఎవరు అనే ట్యాగ్ ని సోషల్ మీడియాలో ట్వీట్స్ వేస్తే అందరికీ మన హీరోని మనమే తక్కువ చేసుకున్నట్లు ఉంటుంది. ఇలాంటి నెగటివ్ ట్రెండ్స్ వల్ల షారుఖ్ ఖాన్ లాంటి హీరోకి, ఆయన ఇమేజ్ కి వచ్చే నష్టమేమి లేదు, ఉండడు కూడా.