Sing Geetham : ‘సింగ్ గీతం’ హీరో అయాన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sing Geetham : సినీ పరిశ్రమలో స్టార్ కిడ్స్ అరంగేట్రాలు ఎప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. అయితే కొన్నిసార్లు ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా, కేవలం ప్రతిభతోనే అవకాశాలను అందిపుచ్చుకునే కొత్త ముఖాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో అలా వినబడుతన్న పేరు అయాన్. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కన ‘సింగ్ గీతం’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు ఆయాన్. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఆ కుర్ర హీరో ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.
తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో క్లాసిక్ చిత్రాలను అందించిన సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో సినిమా చేయడం ఏ కొత్త నటుడికైనా పెద్ద అవకాశమే. అలాంటి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు అయాన్. ‘కల్కి 2898 AD’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణంలో రూపొందిన ‘సింగ్ గీతం’ 2026 జూన్ 11న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. అయితే అయాన్ సినీ ప్రయాణం వెండితెరపై కాకుండా సంగీత ప్రపంచంలో ప్రారంభమైంది. విశాఖపట్నంకు చెందిన ఈ యువకుడు చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నాడు. పెద్ద కలలతో హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన, మొదట గాయకుడిగా తన ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రయత్నించారు. సోషల్ మీడియా వేదికగా తెలుగు, హిందీ భాషల్లో పలు కవర్ సాంగ్స్, ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రాజెక్ట్స్ చేస్తూ క్రమంగా మంచి గుర్తింపు సంపాదించారు.
Also Read
- Nagarjuna: 'చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?'.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
- Sundeep Kishan: 'కరికాల' నా కెరీర్ బెస్ట్.. సందీప్ కిషన్ బిగ్గెస్ట్ ప్లాన్!
- Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ 'బడ్జెట్ పిచ్చి' ఎవరిని ముంచుతుంది?
- Ranabaali Box Office: 'రణబాలి' సేఫ్ కావాలంటే అన్ని కోట్లు కొల్లగొట్టాల్సిందేనా?
సోషల్ మీడియాలో వచ్చిన ఆదరణతో అయాన్ సంగీత రంగంలో మరింత బలంగా నిలదొక్కుకున్నారు. స్టేజ్ షోలు, కర్ణాటక సంగీత కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ తన గాన ప్రతిభను చాటుకున్నారు. ఈ ప్రయాణంలో భాగంగానే ఇటీవల సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో కలిసి పనిచేసే అవకాశం కూడా ఆయనకు దక్కింది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ తెలుగు వెర్షన్‌లోని ‘పూలేమో విరిసే’ పాటకు ఆయన గాత్రం అందించడం విశేషం. హీరోగా పరిచయం కాకముందు అయాన్ ‘బ్యాండ్ కాప్రిసియో’లో ప్రధాన గాయకుడిగా పనిచేశారు. అక్కడి నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన తర్వాత సొంతంగా సంగీత ప్రయాణాన్ని కొనసాగించారు. ఇప్పుడు ‘సింగ్ గీతం’తో మొదటి సినిమాతోనే పేరు తెచ్చుకున్న ఆయాన్, భావష్యత్తులో మరిన్ని విజయాలతో ముందుకు వెళ్ళేలా కనిపిస్తున్నాడు. ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, సింగర్ గా ప్రయాణం మొదలు పెట్టి హీరోగా రాణించడం చెప్పుకోవాల్సిన విషయమే.
- Tags
- cinema
- Sing Geetham
తాజావార్తలు
-
IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
-
CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదపులో అభిజిత్ దీప్కే
-
Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
-
Nagarjuna: ‘చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
-
Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!