Site icon NTV Telugu

Singer KK Death: కేకే మరణానికి ఆ సింగరే కారణం..?

Kk

Kk

ప్రముఖ గాయకుడు కేకే మరణం ప్రస్తుతం సంగీత ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి నింపిన విషయం విదితమే. మంగళవారం రాత్రి లైవ్ కన్సర్ట్ లోనే ఆయన గుండెపోటుతో మృతి చెందారు. అయితే ఆయన మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో సింగర్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతడే కేకే మరణానికి కారణం అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ సింగర్ ఎవరంటే .. బెంగాలీకి చెందిన సింగర్‌ రూపాంకర్‌ బగ్చీ. మంగళవారం సాయంత్రం కేకే లవ్ షోకు ముందు రూపాంకర్ చేసిన ఒక వీడియోనే కొన్ని అనుమానాలకు తావిస్తుంది. ఆ వీడియోలో రూపాంకర్ మాట్లాడుతూ ” కేకే ఎవరు.. అతనిలో అంత గొప్ప ఏంటి..? అతడి కంటే నేను, అనుపమ్‌ రామ్‌, సోమత, ఎమాన్‌ చక్రవర్తి, ఉజ్జయినీ ముఖర్జీ, కాక్టస్‌, ఫాజిల్స్‌, రూపమ్‌ ఇస్లామ్‌ ఇలా మరెంతోమంది కోల్‌కతాకు చెందిన సింగెర్స్ బాగా పాడతారు. అలాంటిది కేకే షో అనగానే ఇంతమంది అతని లైవ్ షోకు ఎందుకు వస్తున్నారు.

మరి మేము లైవ్ షో పెట్టినప్పుడు మీరెందుకు అంత ఎగ్జయిట్‌ అవ్వడం లేదు..? కారణమేంటో చెప్పండి. అసలు కేకే ఎవరు? అలాంటి వాళ్లకంటే మేము చాలా చాలా బాగా పాడతాం. దయచేసి ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయకండి.. బెంగాలీ వాసులకు ఒక్కటే చెప్తున్నా.. లోకల్ సింగర్స్ ను ప్రోత్సహించండి. బెంగాలీ వాసులుగా మసులుకోండి ” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే కేకే మృతి చెందాడు. దింతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక రూపాంకర్ పై నెటిజన్లు విరుచుకుపడ్డారు. నీ శాపనార్ధాల వలనే కేకే మృతి చెందాడు. నువ్వే అతని చావుకు కారణం. అంత కక్ష ఎందుకు.. మనసులో ఎన్నిసార్లు అతడి చావు గురించి కోరుకున్నావో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రస్తుతం ఆ వీడియోను డిలీట్ చేయడం గమనార్హం.

Exit mobile version