Site icon NTV Telugu

Priya Prakash Varrier : మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఎక్కడ..?

Priya Prakash

Priya Prakash

కంటి గీటుతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి.. ఓవర్ నైట్ స్టారైన మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఎక్కడ, ప్రెజెంట్ ఏ ప్రాజెక్టులు చేస్తుంది, అసలు సినిమాలు చేస్తుందా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది. ఒరు ఆదార్ లవ్‌లో కన్ను గీటి మతిపొగొట్టిన మాలీవుడ్ సోయగం ప్రియా ప్రకాష్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా ఛేంజయ్యింది. సపోర్టింగ్ క్యారెక్టర్ కాస్తా మెయిన్ లీడ్‌గా ఛేంజ్ అయ్యింది.

Also Read : Ajith Kumar : అప్పటి వరకు సినిమాల్లో నటించను

ఇండస్ట్రీలో ఎంత ఫేమ్ వచ్చినా ఆవగింత లక్ ఉండాలి. ఈమె విషయంలో ఇదే జరిగింది. లక్ ఫ్యాక్టర్ వర్క్ కావట్లేదు. చెక్, ఇష్క్ నుండి మందాకినీ వరకు మలయాళం, తెలుగులో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. హిందీలో చేసిన యారియన్ 2 బాక్సాఫీస్ బాంబ్ గా మారడంతో ఐరెన్ లెగ్ ట్యాగ్ తగిలించుకుంది.ఫెయిల్యూర్స్ పలకరించినా  ఛాన్సులేమీ కొదవ లేదు భామకు ప్రెజెంట్ అమ్మడి చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ధనుష్ దర్శకత్వంలో ‘నిలువకు ఎన్మేల్ ఎన్నాడీ కోబంతో’ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది అమ్మడు. ఇవే కాదు బాలీవుడ్ లో త్రీ మంకీస్, లవ్ హ్యాకర్స్, కన్నడలో విష్ణు ప్రియ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది భామ. ఇక సోషల్ మీడియాలో కూడా హాట్ ఫోజులతో యూత్ ను నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పటి వరకు హిట్టు మొహం చూడని ఈ అమ్మడు రాబోయే సినిమాలతో హిట్స్ కొట్టి, ఐరెన్ లెగ్ ట్యాగ్ నుండి ఎప్పుడు బయటపడుతుందో లేదో  చూడాలి.

Exit mobile version