Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News When Is The Ott Release Of Aadikeshava Movie

Aadikeshava : ఆదికేశవ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?

Published Date :December 16, 2023 , 11:35 pm
By Murali Krishna
Aadikeshava : ఆదికేశవ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, క్రేజీ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ సినిమా నవంబర్ 24న థియేటర్లలో విడుదల అయింది.దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఆదికేశవ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. కాగా, ఆదికేశవ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍పై తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది.ఆదికేశవ సినిమా డిసెంబర్ 22వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందని తాజాగా సమాచారం అందింది.. దీని ప్రకారం థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది.. అయితే, ఆదికేశవ స్ట్రీమింగ్ డేట్ గురించి నెట్‍ఫ్లిక్స్ ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. డిసెంబర్ 22న ఆదికేశవ స్ట్రీమింగ్‍కు వస్తుందనే వార్త బాగా వైరల్ అవుతుంది.

అయితే ఆదికేశవ సినిమాలో ఓవర్ డోస్ యాక్షన్ సీన్లు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కథ, కథనం కూడా కొత్తగా లేకపోవటంతో ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్‍ ను అందుకుంది. ఈ సినిమా ఫలితానికి తగ్గట్టుగానే కలెక్షన్లు కూడా పేలవంగానే వచ్చాయి.ఆదికేశవ సినిమాలో జోజు జార్జ్, సుమన్, తనికెళ్ల భరణి, సుదర్శన్, అపర్ణా దాస్, జయప్రకాశ్ మరియు రాధికా శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ మూవీకి సంగీతం అందించారు.అన్యాయాలు చూసి సహించని హీరో బాలు (వైష్ణవ్ తేజ్),  హీరోయిన్ చిత్రావతి (శ్రీలీల) అతడి ప్రేమలో పడడం, హీరోకు కుటుంబానికి ఓ ఫ్యాక్షన్ బ్యాక్‍గ్రౌండ్ ఉండడం వంటి అంశాల చుట్టూ ఆదికేశవ మూవీ కథ తిరుగుతుంది. తన సొంత ఊరికి వెళ్లి విలన్‍ను హీరో ఎలా అంతమొందించాడన్నదే ఆ సినిమా ప్రధాన పాయింట్‍గా ఉంది.అయితే థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోని ఆదికేశవ ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి

Also Read

  • Dragon - Peddi : ఎన్టీఆర్ - రామ్ చరణ్ మరోసారి.. ఫ్యాన్స్ కు పూనకాలే
  • Rajinikanth : ఆ ‘100వ సినిమా’ తీయకుండానే వెళ్ళిపోయారు.. ఆర్‌బీ చౌదరి పై రజనీకాంత్ ఎమోషనల్..
  • Simran: బాలీవుడ్ చీకటి కోణాలను బయటపెట్టిన సిమ్రాన్..
  • Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #aadikesava
  • #sreleela
  • OTT Release
  • vaishnav tej

తాజావార్తలు

  • Nida Khan: టీసీఎస్ మతమార్పిడి కేసు.. పరారీలో ఉన్న నిదా ఖాన్ పోలీసులకు ఎలా చిక్కింది..?

  • TVK Government Formation: తమిళనాడు కోటపై టీవీకే జెండా.. లెఫ్ట్ పార్టీలు, వీసీకే అండతో సీఎం పీఠంపై విజయ్!

  • Mani Shankar Aiyar: ‘‘కాంగ్రెస్‌ది నీచ రాజకీయం’’.. విజయ్‌తో పొత్తుపై సొంత పార్టీ నేత విమర్శలు..

  • Tamil Nadu: ఎంకే.స్టాలిన్ మాస్టర్ ప్లాన్.. తమిళనాడు అట్టుడుకనుందా!?

  • Kalahandi Issues: డిజిటల్ ఇండియాలో ‘మంచమే’ అంబులెన్స్.. గర్భిణిని కిలోమీటరు మోసుకెళ్లిన గ్రామస్థులు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions