Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఎట్టకేలకు ఓజీ షూటింగ్ కు హాజరయినట్టు తెలుస్తోంది. చాలా నెలలుగా ఆగిపోయిన ఓజీ షూటింగ్ మొన్ననే రీ స్టార్ట్ అయింది. ఈ మేరకు మేకర్స్ ప్రకటించారు. ఈ రోజు పవన్ కల్యాణ్ ఓజీ షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ సారి బ్రేక్ ఇవ్వకుండా మూవీని ముగించేయాలని ఫిక్స్ అయ్యారంట పవన్ కల్యాణ్. ఇప్పటికే హరిహర వీరమల్లును ముగించేశాడు. ఇప్పుడు ఓజీ కూడా త్వరగానే ముగించబోతున్నారు. దీంతో హరీశ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై కూడా ఆశలు చిగురిస్తున్నాయి అభిమానులకు. ఈ మూవీ కూడా ఏపీ ఎన్నికల సమయంలోనే ఆగిపోయింది. మూవీ షూటింగ్ కొంత వరకు చేశారు.
Read Also : Movie Ticket Prices: సినిమా టికెట్ల ధరల ఖరారుపై ఏపీ సర్కార్ కమిటీ..
హరీశ్ శంకర్ ఈ మూవీని కంప్లీట్ చేసి ఎలాగైనా హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నాడు. కానీ దీని తర్వాత స్టార్ట్ అయిన ఓజీ కోసం పవన్ డేట్లు కేటాయించేశాడు. వీరమల్లు, ఓజీ కంప్లీట్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే పెండింగ్ లో ఉంటుంది. కాబట్టి త్వరలోనే దీన్ని కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడంట పవన్ కల్యాణ్. ఓజీ అయిపోయిన తర్వాత ఉస్తాద్ షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ ఉంది. త్వరలోనే దీన్ని కూడా సెట్స్ మీదకు తీసుకెళ్తారంట. వీలైనంత త్వరగా పెండింగ్ సినిమాలు అన్నీ కంప్లీట్ చేసేసి నిర్మాతల మీద భారం తగ్గించాలని చూస్తున్నాడంట పవన్ కల్యాణ్.
Read Also : Hit3 : హిట్-3 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..?
