అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. 2024 కంప్లీట్ కానుండటంతో తన ఇష్టాఇష్టాలను సోషల్ మీడియాలో రివైండ్ చేసుకున్నాడు అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామా. ఇదిగో నేను సమ్మర్‌లో చదివిన బుక్స్ లిస్ట్. నా ఫేవరేట్ బుక్స్, మ్యూజిక్, మూవీస్ లిస్ట్ అంటూ షేర్ చేసుకున్నాడు. ఇక్కడే ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ తెలిసింది. ఆయనకు నచ్చిన సినిమాల్లో ఇండియన్ మూవీ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకు ఆ మూవీ ఏంటంటే ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’.
Also Read : Allu Arjun : పోలీస్ స్టేషన్ కు చేరుకున్నఅల్లు అర్జున్..
లేడీ డైరెక్టర్ పాయల్ కపాడియా తెరకెక్కించిన ఈ మూవీ ఈ ఏడాది కేన్స్ ఉత్సవాల్లో స్క్రీనింగై గ్రాండ్ ప్రిక్స్ అవార్డు గెలుచుకుంది. 30 ఏళ్ల తర్వాత కేన్స్ ఉత్సవాల్లో ఈ అరుదైన ఘనత దక్కించుకోవడమే కాదు 82వ గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారాలకు ఈ సినిమా నామినేట్ అయ్యింది. ఇండియాలో కేరళలో సెప్టెంబర్ 21, నెక్ట్స్ నవంబర్ 29న రిలీజై మిక్స్ డ్ రివ్యూ తెచ్చుకుంది. ఒబామాను అంతలా ఇంప్రెస్ చేసిన ఈ స్టోరీ ఏంటంటే ముంబయి నర్సింగ్ హోంలో వర్క్ చేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సులు, పార్వతి అనే వంటమ్మాయి ఈ ముగ్గురు చుట్టూ అల్లుకున్న కథనే ఈ మూవీ. ఫీమేల్ డైరెక్టర్ ఇలాంటి సినిమా చేయడం డేర్ అయినప్పటికీ న్యూడిటీ ఉందని విమర్శించిన వారు లేకపోలేదు. కానీ ఇండియన్ సినిమా అంటే ఇలాగే ఉండాలి అనే మూసధోరణితో పాతుకుపోయిన నేపథ్యంలో ఈ సినిమా ఎక్కదు. ఎప్పుడైనా మన ఇంట్లో బంగారాన్ని గుర్తించలేం. పక్కింటోళ్లు ప్రశంసిస్తే తప్ప. మనవాళ్ళు అంతగా గుర్తించని ఈ సినిమా ఒబామా మెచ్చుకోవడం విశేషం.