Tollywood : సినిమాలో దమ్ముంటే ట్రోల్స్ ఆపుతాయా..?
- సినిమాలను నెగెటివ్ ట్రోల్స్ ఆపుతాయా..?
- కంటెంట్ కంటే ట్రోల్స్ గొప్పవా..
- సినిమా ఆడకుంటే ట్రోల్స్ కారణమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఈ నడుమ ఎక్కువగా వినిపిస్తున్న మాట ఒక్కటే.. ‘మా సినిమాను చంపేస్తున్నారు’. నెగెటివ్ ట్రోల్స్, నెగెటివ్ రివ్యూలతో మంచి సినిమాను తొక్కేస్తున్నారంటూ నిర్మాతలు, డైరెక్టర్లు, నటులు, చివరకు హీరోలు కూడా ఇదే మాట అనేస్తున్నారు. ఇంకొన్ని సార్లు అయితే చిన్న సినిమాను చంపేస్తున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ సినిమా ఇండస్ట్రీకి జడ్జి ఎవరు.. ప్రేక్షకులే కదా. ప్రేక్షకులు ఇచ్చిందే తీర్పు. వాళ్లకు నచ్చితే ఏ సినిమాను అయినా లేపుతారు. నచ్చకపోతే ఎంత పెద్ద బడ్జెట్ తో తీసినా పట్టించుకోరు. ఇది చాలా సినిమాల విషయంలో నిరూపితం అయింది. చిన్న సినిమాగా వచ్చిన బలగం.. ఓ సెన్సేషన్ అయింది.
తేజ సజ్జా నటించిన హనుమాన్.. రిలీజ్ వరకు పెద్ద అంచనాలే లేవు. కానీ పాన్ ఇండియా మార్కెట్ ను ఓ ఊపు ఊపేసింది. వంద రెట్లు లాభం తెచ్చిపెట్టింది. ‘కలర్ ఫొటో’లో పెద్ద నటులే లేరు. కానీ ఆ మూవీ ఇండస్ట్రీ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. నిఖిల్ చేసిన కార్తికేయ-2ను తొక్కేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. కానీ ప్రేక్షకులు పాన్ ఇండియా హిట్ చేసి పడేశారు. అదే టైమ్ లో వందల కోట్ల బడ్జెట్ తో వచ్చిన చాలా సినిమాలు పావు వంతు కూడా వసూలు చేయలేక థియేటర్ల నుంచి తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గేమ్ ఛేంజర్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పెద్ద డైరెక్టర్ శంకర్ ఉన్నారు. దాదాపు నాలుగు వందల కోట్లతో తీశారు. కానీ డిజాస్టర్ టాక్. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ దాదాపు రూ.500 కోట్లతో తీస్తే.. అందులో పావు వంతు కూడా రాలేదు. పైగా చూసిన వాళ్లు తిట్టిపోశారు.
Also Read
- Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
Read Also : Samantha: డేట్ చేస్తున్న డైరెక్టర్తో తిరుమలకి సమంత?
మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం కూడా అంతే. ఆ మూవీని త్రివిక్రమ్ భారీ బడ్జెట్ తో డైరెక్ట్ చేసినా.. మహేశ్ ఫ్యాన్స్ వరకే వెళ్లింది. అంతకు మించి హిట్ టాక్ తెచ్చుకోలేదు. తమిళ సూపర్ స్టార్ విజయ్ కు తెలుగులో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన గోట్ మూవీ వందల కోట్లతో తీశారు. కానీ మొదటిరోజే డిజాస్టర్ టాక్ తో.. కుప్పకూలిపోయింది. ఇక్కడ స్టార్ హీరోలు అయితే వాళ్ల కల్ట్ ఫ్యాన్స్ వరకు సినిమా ఎలా ఉన్నా చూస్తారు. కానీ సగటు సినిమా ప్రేక్షకుడు థియేటర్ కు వెళ్లి మూవీ చూడాలి అంటే.. అందులో కంటెంట్ ఉండాలి. దానికి తోడు విజువల్స్, యాక్టింగ్, ఎంటర్ టైన్ మెంట్.. ఇవన్నీ ఉంటే కచ్చితంగా మౌత్ టాక్ తోనే సినిమాకు కలెక్షన్లు వస్తాయి.
ఎంత పెద్ద సూపర్ స్టార్ నటించినా సరే.. ప్రేక్షకులకు కథ నచ్చితేనే హిట్. లేదంటే ఆ హీరో డై హార్డ్ ఫ్యాన్స్ మొదటి, రెండో రోజు చూస్తారు. కానీ ఆ తర్వాత హిట్ చేసేది మాత్రం సినిమా ప్రేక్షకులే. హీరోల అభిమానులు చూసినంత మాత్రాన మూవీ హిట్ కాదు. కనీసం కలెక్షన్లు కూడా అనుకున్నంత రావు. కథలో దమ్ముంటే ఆ సినిమాను ప్రేక్షకులే హిట్ చేసి పడేస్తారు. కథలో దమ్ము లేకుంటే ఎంత రుద్దినా పట్టించుకోరు. అలాంటప్పుడు మా సినిమాను తొక్కేస్తున్నారు.. మా సినిమాను చంపేస్తున్నారు అని అనడం వృథానే. ఈ నడుమ కొందరు సింపతీ కోసమో లేదంటే తమ సినిమా కలెక్షన్లు పెంచుకోవడం కోసమే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు అనిపిస్తుంది. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. సినిమా ఆడకపోతే ట్రోల్స్ ను కారణంగా చూపించడం అంటే.. తమ సినిమాలో కంటెంట్ లేదనే విషయాన్ని కవర్ చేయడమే. చిన్న సినిమాలే కాదు.. పెద్ద సినిమాల వాళ్లు కూడా ఇదే అంటున్నారు. కానీ ఎంత నెగెటివ్ ట్రోల్స్ చేసినా ప్రేక్షకులకు నచ్చితే ఆపడం ఎవరి తరం కాదు.
తాజావార్తలు
-
Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?
-
BC Reservations: 34 శాతం బీసీ కోటాపై ఉత్కంఠ.. రిజర్వేషన్ల డేటా సమర్పించాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
-
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
ట్రెండింగ్
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!