Welcome To The Jungle : బికినీ సీన్లకు సెన్సార్ బ్రేక్… ‘వెల్కమ్ టు ది జంగిల్’ రిలీజ్‌కు ముందే 18 కత్తెరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Welcome To The Jungle : బాలీవుడ్లో కామెడీ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ‘వెల్కమ్’ ఫ్రాంచైజీ మరోసారి ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతోంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘వెల్కమ్ టు ది జంగిల్’ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుండగా, రిలీజ్‌కు ముందే ఈ సినిమా మరో కారణంతో వార్తల్లో నిలిచింది. సినిమాలు సెన్సార్ ప్రక్రియను పూర్తి చేయడం సహజమే అయినప్పటికీ, ఈ చిత్రానికి ఏకంగా 18 మార్పులు సూచించడమే ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా గ్లామర్ సన్నివేశాలపై సెన్సార్ బోర్డు ఈ నిర్ణయం తీసుకన్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు అహ్మద్ ఖాన్ తెరకెక్కించిన ఈ భారీ మల్టీస్టారర్ కామెడీ ఎంటర్టైనర్ ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పూర్తి చేసుకుంది. సినిమా ఫైనల్ వెర్షన్లో మొత్తం 18 మార్పులు చేయాలని సీబీఎఫ్సీ సూచించింది. కొన్ని డైలాగ్‌లను మ్యూట్ చేయడం, మార్చడం మాత్రమే కాకుండా, పలు విజువల్స్‌ను పూర్తిగా తొలగించాలని కూడా బోర్డు ఆదేశించింది. ముఖ్యంగా సినిమాలో గ్లామర్ ప్రెజెంటేషన్‌ను తగ్గించే దిశగా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ మార్పుల్లో దిశా పటాని, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లకు సంబంధించిన కొన్ని బికినీ షాట్లు, రొమాంటిక్ సీన్స్ లో అశ్లీలత హైలైట్ చేసే కొన్ని క్లోజప్ ఫ్రేమ్‌లను కూడా తొలగించాలని సెన్సార్ బోర్డు సూచించింది. అన్ని మార్పులు పూర్తయిన తర్వాత రెండు గంటల 44 నిమిషాల రన్టైమ్తో అనుమతి లభించింది ఈ మూవీకి.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
కామెడీ, యాక్షన్, అడ్వెంచర్ అంశాలను మేళవిస్తూ రూపొందిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో పాటు సునీల్ శెట్టి, అర్షద్ వార్సి, పరేష్ రావల్, జాకీ ష్రాఫ్, రవీనా టాండన్, లారా దత్తా, జానీ లీవర్, రాజ్‌పాల్ యాదవ్, శ్రేయాస్ తల్పడే, తుషార్ కపూర్, ఊర్వశి రౌతేలా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా ఫ్రాంచైజీ అభిమానుల్లో ఇప్పటికే మంచి అంచనాలను సృష్టించింది. ‘వెల్కమ్’ సిరీస్‌కు గతంలో వచ్చిన రెండు చిత్రాలు కామెడీ ఎంటర్టైనర్లుగా మంచి విజయాలు సాధించాయి. అదే బ్రాండ్‌ను కొనసాగిస్తూ, మరింత పెద్ద స్థాయిలో రూపొందిన ‘వెల్కమ్ టు ది జంగిల్’ కూడా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో చిత్ర బృందం ఉంది. అయితే విడుదలకు ముందే సెన్సార్ సూచించిన 18 మార్పులు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు ఈ మార్పుల తర్వాత సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది విడుదల అనంతరం తేలనుంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!