Site icon NTV Telugu

WAR 2: 50 డేస్ కౌంట్‌డౌన్‌ పోస్టర్స్ షేర్ చేసిన యంగ్ టైగర్

War 2

War 2

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా వార్ 2. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ కు బ్రహ్మాస్త్ర వంటి బ్లాక్ బస్టర్ అందించిన అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్ పై వార్ 2 ను నిర్మిస్తోంది.ఇటీవల రిలీజ్ చేసిన వార్ 2 గ్లిమ్స్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Also Read : Jani Master : జానీ మాస్టర్ కు ఛాన్స్ ఇచ్చిన టాలీవుడ్ స్టార్ హీరో

భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టబోతోంది. అంటే సరిగ్గా నేటి నుండి 50 రోజులలో వార్ 2 వెండితెరపై విద్వాంసం చేసేందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నటీ నటులు ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ స్పెషల్ పోస్టర్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసారు. అవి నెట్టింట వైరల్ గా మారాయి. మరోవైపు ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ షూటింగ్ కోసం ఎన్టీఆర్ నేడు ముంబైకు చేరుకున్నాడు. హృతిక్, ఎన్టీఆర్ లపై షూట్ చేయనున్న ఈ సాంగ్ ను భారీ సెట్స్ మధ్యలో గ్రాండియర్ గా షూట్ చేయనున్నారని సమాచారం. రిలీజ్ దగ్గరపడుతుండంతో వార్ 2 థియేట్రికల్ రైట్స్ డీల్స్ క్లోజ్ చేస్తున్నారు మేకర్స్. తమిళనాడులో ఈ సినిమాను థింక్ స్టూడియోస్ రిలీజ్ చేస్తుండగా తెలుగులో యష్ రాజ్ ఫిల్మ్స్ సొంతంగా రిలీజ్ చేస్తుంది. అందుకోసం థియేట్రికల్ అగ్రిమెంట్స్ కూడా ఫినిష్ చేసింది.

Exit mobile version