Site icon NTV Telugu

WAR 2 : వార్ 2 రన్ టైమ్ ఫిక్స్.. హిందీకే ఇంపార్టెన్స్

War2

War2

WAR 2 : హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్-2పై మంచి అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గానే రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైమ్ లో ప్రమోషన్లలో జోరు పెంచారు. ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. తాజాగా మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. హిందీలో రన్ టైమ్ 53 నిమిషాల, 24 సెకన్లు కాగా.. తెలుగు, తమిళ భాషల్లో 2 గంటల 51 నిమిషాల 44 సెకన్లుగా ఉంది. చూస్తుంటే తెలుగు కంటే హిందీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో మరోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఎన్టీఆర్ ను తక్కువ చేసి చూపిస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు.

Read Also : Sathya Raj : తలమీద కాలు పెట్టే సీన్.. ప్రభాస్ అలా అన్నాడు

ఇప్పుడు వస్తున్న వరుస అప్డేట్లు అన్నీ ఎన్టీఆర్ కంటే హృతిక్ రోషన్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తున్నాయి. తీరా రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఏ మాత్రం తేడా కొట్టినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ స్థాయిలో రచ్చ చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ తెలుగులో ఎన్టీఆర్ సినిమా స్థాయిలో బిజినెస్, క్రేజ్ కనిపించట్లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూలీ మూవీ సౌత్ లో టాప్ లో ఉండగా.. తెలుగులో కూడా వార్-2 పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోతోంది. దీనికి కారణం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంత అసంతృప్తిలో ఉండటమే అని తెలుస్తోంది.

Read Also : Srinu Vaitla : ‘ఢీ’ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన శ్రీనువైట్ల..

Exit mobile version