యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ ముల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
Also Read : WAR 2 : వార్ 2 కోసం రంగంలోకి ‘బ్రహ్మాస్త్ర’ టీమ్.. ఎందుకంటే?
రిలీజ్ కు గట్టిగా రెండు వారాలు ఉంది. ఇద్దరు బడా స్టార్స్ ఉన్న సినిమాకు ప్రస్తుతం ఉన్నబజ్ సరిపోదు. అందుకే తెలుగు హక్కులు దక్కించుకున్న నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ వార్ 2 కోసం భారీ ప్లానింగ్ రెడీ చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధం చేస్తున్నాడు. కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సెన్సేషన్ క్రియేట్ చేయాలనీ నాగవంశీ వ్యూహ రచన చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో విజయవాడ లో ఆగస్టు 10న వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. నిన్న, మొన్నటి వరకు కేవలం ఊహాగానాలు వినిపించగా ఇప్పుడు అక్కడే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా హాజరుబోతున్నారట. అదే జరిగితే వార్ 2 ఈవెంట్ హిస్టారీ క్రియేట్ చేయడం ఖాయం. మరోవైపు ఈ వేడుకను నెవర్ బిఫోర్ రేంజ్ లో సెలెబ్రేట్ చేసేందుకు నందమూరి అభిమాలనులు ఇప్పటినుండే ఏర్పాట్లు చేస్తున్నారు.
