టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు రేపుతున్న ‘వృషకర్మ’ చిత్రానికి సంబంధించి తెరవెనుక బిజినెస్ చేతులు మారింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం ఇండస్ట్రీలో ఓ బడా నిర్మాత ముందు ఆసక్తి చూపించగా చివరికి దిల్ రాజు ఆ హక్కులను సొంతం చేసుకుని ట్రేడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముందుగా ఈ హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నించారు. డీల్ దాదాపు ఆయనకే కన్ఫర్మ్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ కూడా నడిచింది. కానీ, అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నాగవంశీ చేజారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాక్సాఫీస్ వద్ద జాక్‌పాట్ కొట్టేలా కనిపిస్తున్న ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌ను ఆయన ఎందుకు వదులుకున్నారు అనేది ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
నాగవంశీ వెనక్కి తగ్గడంతో సీన్‌లోకి ఎంటరైన దిల్ రాజు.. ఏమాత్రం హడావిడి పడకుండా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ‘వృషకర్మ’ సినిమా మొత్తాన్ని స్పెషల్‌గా చూసిన తర్వాత, అవుట్‌పుట్‌పై పూర్తి నమ్మకం కుదిరాకే ఆయన ఈ డీల్‌ను క్లోజ్ చేశారు. ఏకంగా రూ. 45 కోట్లకు ఈ మూడు రాష్ట్రాల రైట్స్‌ను దిల్ రాజు ఫైనల్ చేసుకోవడం విశేషం. (ఈ అమౌంట్‌లో రూ. 5 కోట్లు రిఫండబుల్ అని సమాచారం). సినిమా కంటెంట్‌పై తనకు ఉన్న అపారమైన నమ్మకంతోనే ఆయన ఈ స్థాయి భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం ‘వృషకర్మ’ సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఈ రూ. 45 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సునాయాసంగా దాటేస్తుందని బాక్సాఫీస్ పండితులు జోస్యం చెబుతున్నారు. డిస్ట్రిబ్యూషన్ రంగంలో దిల్ రాజుకున్న పక్కా ప్లానింగ్, థియేటర్ల నెట్‌వర్క్ తోడైతే ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

