సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కేరళలో నిర్వహించిన ఎంబీఐఎఫ్ఎల్ 2023కి గెస్టుగా వచ్చాడు. ఈ స్టేజ్ పైన ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు నేషనల్ వైడ్ సెన్సేషనల్ అయ్యాయి. ‘‘బాలీవుడ్ బాయ్‌కాట్ బ్యాచ్ మొత్తం పఠాన్ సినిమాను బాయ్‌కాట్ చేయాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు అది రూ.700 కోట్లు రాబట్టే దిశగా పరుగులు తీస్తోంది. పఠాన్‌ని బాయ్‌కాట్ చేయాలనుకున్న ఈ ఇడియట్స్.. మోడీ సినిమాని కనీసం రూ.30 కోట్ల వరకు కూడా నడిపించలేకపోయారు. వీళ్లు కుక్కల్లా మొరుగుతారే తప్ప, కరవరు. వీరి విషయంలో చింతించాల్సిన అవసరమే లేదు. వీరి వల్ల శబ్ద కాలుష్యం సంభవిస్తుంది. ఇక కశ్మీర్ ఫైల్స్ అయితే అత్యంత చెత్త సినిమాల్లో ఒకటి. ఆ సినిమాను ఎవరు నిర్మించారో మనందరికీ తెలుసు. అంతర్జాతీయ జ్యూరీ ఈ సినిమాపై ఉమ్మేసింది. సిగ్గుచేటు ఏమిటంటే.. నాకెందుకు ఆస్కార్ రాలేదని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అడుగుతున్నాడు. అతనికి కనీసం భాస్కర్ అవార్డ్ కూడా రాదు. విదేశాల్లో సెన్సిటివ్ మీడియా ఉంది. కానీ, ఇక్కడ ఒక ప్రోపగాండా సినిమా తీయొచ్చు. ద కశ్మీర్ ఫైల్స్ తరహా సినిమాలు చేసేందుకు రూ.2 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెడుతున్నారని నాకు తెలిసింది’’ అంటూ చెప్పుకొచ్చారు.
ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ పై కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, ప్రకాష్ రాజు ని ‘అంధకార్ రాజ్’ అంటూ ఘాటుగా రెస్పాండ్ అయ్యాడు. “A small, people’s film #TheKashmirFiles has given sleepless nights to #UrbanNaxals so much that one of their Pidi is troubled even after one year, calling its viewer’s barking dogs. And Mr. Andhkaar Raj, how can I get Bhaskar, she/he is all yours. Forever.” అంటూ వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేశాడు. చివరగా భాస్కర్ అవార్డ్ నీ దగ్గర ఉంటే నేనేలా పొందగలను అని వివేక్ అగ్నిహోత్రి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వివేక్ అగ్నిహోత్రి తనపై వచ్చిన ఏ విమర్శలనైనా వెంటనే తిప్పికొట్టడం, కామెంట్స్ చేసిన వాళ్లపై వీలైనంత త్వరగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేయ్యడంలో ముందుంటాడు. ప్రకాష్ రాజ్ కూడా దాదాపు ఈ కోవలోకే చెందిన వ్యక్తి. వ్యక్తిగత విమర్శలకి దూరంగా ఉంటూ సమస్యల్ని మాత్రమే మాట్లాడే ప్రకాష్ రాజ్ కూడా తనని ఎవరైనా అసంధర్భంగా కామెంట్ చేస్తే మౌనంగా ఉండడు. మరి ఈ ఇద్దరి వివాదం ఎంతవరకూ వచ్చి ఆగుతుందో చూడాలి.
A small, people’s film #TheKashmirFiles has given sleepless nights to #UrbanNaxals so much that one of their Pidi is troubled even after one year, calling its viewer’s barking dogs. And Mr. Andhkaar Raj, how can I get Bhaskar, she/he is all yours. Forever. pic.twitter.com/BbUMadCN8F
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) February 9, 2023