NTV Telugu Site icon

Adipurush: రాత్రి తాగేసి పొద్దున్నే దేవుడంటే ఎలా?.. కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Viveg Agnihotri Comments On Adipurush

Viveg Agnihotri Comments On Adipurush

Vivek Agnihotri comments on Adipurush: ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టడమే కాదు వివాదాస్పదంగా కూడా మారిన వివేక్ అగ్నిహోత్రి తాజాగా ఆదిపురుష్ సినిమాపై ఆ సినిమాలో నటీనటులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆదిపురుష్ సినిమా విషయంలో ఎక్కడ తప్పు జరిగింది అనే ప్రశ్నకు స్పందించిన ఆయన ఈ సినిమా దర్శక నిర్మాతలతో పాటు నటీనటులపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు నడుస్తున్నాయి కదా అని మనకు ఏ మాత్రం నమ్మకం లేని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే ఇలాగే ఇబ్బంది పడక తప్పదని ఆయన అన్నారు. ఎవరి నమ్మకాలకు సంబంధించిన సినిమా అయినా చేయాలనుకున్నప్పుడు ఆ సబ్జెక్టు మీద 100% పట్టు ఉంటే తప్ప సినిమాలు చేయకూడదని కానీ ఇండియాలో మాత్రం అలాంటి రూల్స్ ఎవరూ ఫాలో అవ్వడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

Bro Pre Release Event: పోలీసుల హెచ్చరిక.. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆలస్యం

రామాయణం, మహాభారతం, భగవద్గీతకు సంబంధించి ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు ఎవరూ దానిమీద 100% ఎఫర్ట్ పెట్టడం లేదు అని అర్థం వచ్చేలా ఆయన కామెంట్ చేశారు. రామాయణ, మహాభారత, భగవద్గీతలు ఎవరూ చెప్పకపోయినా మన మెదళ్ళలో ఎంతో కొంత ముద్రించుకు పోయి ఉండడానికి ఏదో బలమైన కారణం ఉందని ఆయన చెప్పకొచ్చారు. అలాగే ఈరోజు ఎవరు పడితే వారు తెరమీద కనపడి నేను దేవుడిని అని అనేస్తే సరిపోదని ఆయన కామెంట్ చేశారు. రాత్రంతా తాగుతూ ఉండి పొద్దున్నే ఆన్ స్క్రీన్ మీదకు వచ్చి నేను దేవుడిని అంటే నమ్మే రోజులు పోయాయని ఆయన కామెంట్ చేశారు.

జనం ఇడియట్స్ కాదని పేర్కొన్న ఆయన తెర మీదకు వచ్చి నేను దేవుడిని అంటే నమ్మే రోజులు పోయాయి అంటూ మరోసారి కామెంట్ చేశారు. అయితే ఆయన పర్టిక్యులర్గా ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ చేశారో తెలియకపోయినా ఆదిపురుష్ లో నటీనటుల మీద దర్శక నిర్మాతల మీద ఆయన చేసిన కామెంట్లు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఆయా దర్శక నిర్మాతలు లేదా నటీనటుల అభిమానులు వివేక్ అగ్నిహోత్రిని టార్గెట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాఘవుడి పాత్రలో కనిపించగా కృతి సనన్ జానకి పాత్రలో కనిపించింది. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపించగా హనుమాన్ పాత్రలో దేవదత్త నాగే నటించారు. లంకేశ్వరుడు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ సినిమాని ఓం రౌత్ డైరెక్ట్ చేశాడు.