Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
- సూర్య కొత్త లుక్, మమితాతో ఫ్రెష్ కెమిస్ట్రీ
- ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీతో ఎమోషనల్ టచ్
- ఆలోచింపజేసే డైలాగ్స్‌కు ప్రశంసలు
- జీవీ ప్రకాష్ బీజీఎంతో ట్రైలర్‌కు మరో స్థాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwanath and Sons Trailer: తమిళ స్టార్ హీరో సూర్య, ‘ప్రేమలు’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కుర్రకారు కలల రాణి మమిత బైజు కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons). ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, సాంగ్స్ విశేష ఆదరణ పొందగా, తాజాగా మేకర్స్ విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేసింది.
సరికొత్త రోల్లో సూర్య.. అలరిస్తున్న ‘ఏజ్ గ్యాప్’ లవ్ స్టోరీ
ట్రైలర్ పరిశీలిస్తే సూర్య, మమితా బైజుల స్క్రీన్ ప్రెజెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సూర్య గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత కూల్ అండ్ క్లాసీ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ‘సంజయ్ విశ్వనాథ్’ అనే ఒక ప్రొఫెషనల్ షూటర్ పాత్రలో మెరవనున్నారు. తన కంటే వయసులో చాలా చిన్నదైన కథానాయిక మమితా బైజు, సూర్య జీవితంలోకి అడుగుపెట్టి ఆయన్ని ఆరాధించే క్రమాన్ని , వారి మధ్య ఉన్న ‘ఏజ్ గ్యాప్’ చుట్టూ తిరిగే సున్నితమైన భావోద్వేగాలను దర్శకుడు వెంకీ అట్లూరి ఎంతో హృద్యంగా ఆవిష్కరించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ఆలోచింపజేసే సంభాషణలు.. హృదయాన్ని తాకే సంగీతం
సినిమాలో సూర్య చెప్పే ప్రతి డైలాగ్ ఎంతో లోతైన అర్థంతో ఇంటెన్స్‌గా సాగాయి. ముఖ్యంగా “మన డబ్బు, స్టేటస్, అన్నీ మనకు సౌకర్యాన్ని ఇవ్వాలి.. అంతేగానీ అహంకారం కాకూడదు” అని చెప్పే మాటలు, అలాగే “మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదండీ.. ఒక గొడవ జరిగిన తర్వాత మళ్లీ ఎలా మాట్లాడాలో తెలియక” , “గెలిచేదాకా ఆగకూడదు.. గెలిచిన తర్వాత ఆ గెలుపు గురించి ఎక్కువ మాట్లాడకూడదు” వంటి డైలాగ్స్ ప్రేక్షక దేవుళ్లను ఎంతగానో ఆలోచింపజేస్తున్నాయి. దీనికి తోడు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌లోని ఎమోషన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లి ప్రాణం పోసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా అత్యంత విలాసవంతమైన నిర్మాణ విలువలతో ఈ భారీ చిత్రాన్ని నిర్మించాయి.
తాజావార్తలు
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్’.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!