Site icon NTV Telugu

Vishwambhara : విశ్వంభర వాయిదా.. అనిల్ రావిపూడి ఫుల్ హ్యాపీ

Vishwambhara

Vishwambhara

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై చాలా అనుమానాలు ఉండేవి. వచ్చే సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ అవుతుందనే వార్తలు వచ్చాయి. అది కుదరకపోతే అక్టోబర్, లేదా నవంబర్ అన్నారు. కానీ ఎట్టకేలకు రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు చిరు. 2026 సమ్మర్ లో దీన్ని రిలీజ్ చేస్తున్నామన్నారు. వీఎఫ్‌ ఎక్స్ భారీగా ఉందని.. అందుకే డిలే అవుతుందన్నారు. అంటే అనిల్ రావిపూడితో తీస్తున్న మెగా 157 మూవీ తర్వాతనే ఇది రాబోతోంది. మొన్నటి వరకు దానికంటే ముందే వస్తుందనే ప్రచారం ఉండేది. ఇప్పుడు రాకపోవడంతో అనిల్ రావిపూడి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కాబోలు.

Read Also : Nagarjuna : నాగార్జునకు ఫిదా అయిన తమిళ తంబీలు.. ఎందుకంటే..?

ఎందుకంటే తన సినిమా కంటే ముందు విశ్వంభర వచ్చి పెద్ద హిట్ అయి ఉంటే ఆ ప్రెషర్ అంతా అనిల్ మీద ఉండేది. విశ్వంభర కంటే అనిల్ సినిమా పెద్ద హిట్ కావాలనే ఒత్తిడి ఉండేది. ఒకవేళ విశ్వంభర ప్లాప్ అయితే.. అప్పుడు అంతా అనిల్ మీదనే భారం వేసేవాళ్లు. కచ్చితంగా మెగా 157తో పెద్ద హిట్ ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి వచ్చేది. ఎలా చూసినా అనిల్ కు ఇబ్బందే. ఇప్పుడు విశ్వంభర తన సినిమా తర్వాత వస్తోంది కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా తన సినిమాను రిలీజ్ చేసుకోవచ్చు. అనిల్ సినిమా ఏ మాత్రం హిట్ అయినా అది విశ్వంభరకు కలిసొస్తుంది. విశ్వంభర మార్కెట్ ఇంకా పెరుగుతుంది. కాబట్టి అనిల్ కు ప్రశంసలే తప్ప విమర్శలు రావన్నమాట.

Read Also : Payal Rajput : బాబోయ్.. పాయల్ ను ఇలా చూస్తే అంతే

Exit mobile version