Vishwak Sen: ఆరేళ్లు.. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen: ఇప్పుడున్న ఇండస్ట్రీలో విలువలు తక్కువ అని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. ఒకప్పుడు హీరోలు.. ఒక సినిమా పోతే.. ఇంకో సినిమాను ఆ నిర్మాతతో ఫ్రీగా చేసేవారు.. కొంతమంది రెమ్యూనిరేషన్ తీసుకొనేవారు కూడా కాదు అని చెప్పుకొస్తుంటారు. ఈ జనరేషన్ లో అలాంటి వారు లేరు. ఒక్క సినిమా హిట్ అవ్వగానే.. తరువాతి సినిమాకుఅంతకు మించి ఎక్కువ అడుగుతారు. సినిమా చేసే టైమ్ లో అనుకున్నంత రెమ్యూనిరేషన్ ఇచ్చినా..సినిమా భారీ హిట్ అయితే.. ఇంకొంత డబ్బులు ఇవ్వాలని అడుగుతారు. కానీ, ఆరేళ్ళు సినిమా చేసినా.. ఒక్క రూపాయి కూడా రెమ్యూనిరేషన్ తీసుకోలేదట ఒక యంగ్ హీరో. ఏంటి .. నిజమా..? ఎవరా హీరో అంటే.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్. హీరోగా, డైరెక్టర్ గావిభిన్నమైన కథలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విశ్వక్ నటించిన తాజా చిత్రం గామి.
విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. దాదాపు ఆరేళ్లుగా ఈ సినిమాను క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2018 లో గామి సెట్స్ మీదకు వెళ్ళింది. అప్పటికీ విశ్వక్.. కుర్ర హీరోనే కానీ అంత స్టార్ డమ్ తెచ్చుకోలేదు. 2023 కు ఈ సినిమా పూర్తీ అయ్యింది. మధ్యలో విశ్వక్ కు హిట్స్ పడ్డాయి. స్టార్ హీరోగా మారాడు. అయినా కూడా గామి సెట్స్ కు ఎప్పుడు స్టార్ హోదాతో వెళ్లలేదట. “ఈ సినిమాకు నేను ఫండ్ ఇచ్చింది అంటే నేను రెమ్యూనిరేషన్ తీసుకోకపోవడమే. ఈ ఆరేళ్ళు.. గామి సెట్ లో మొదటిరోజు ఎలా ఉన్నానో.. ఆరునెలల క్రితం జరిగిన షూటింగ్ లో కూడా అలాగే ఉన్నాను. ఆరేళ్ళు.. రూ. 25లక్షల పెట్టుబడి.. సినిమాను ఎలాగైనా పూర్తిచేశాం. మార్చి 8 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమా విశ్వక్ కు ఎలాంటి విజయాన్ని తీసుకొచ్చి పెడుతుందో చూడాలి.
Also Read
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన 'యేషనాగుల'.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
- Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
తాజావార్తలు
-
Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
-
El Nino: 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో.. 100% కొనసాగుతుందని WMO హెచ్చరిక
-
Konda Surekha : గతంలో పార్టీని తిట్టిన వారిపై చర్యలేవి.? కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
-
PM Modi: కిర్గిజ్‌స్థాన్‌లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
-
Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్‌లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!