NTV Telugu Site icon

Vishwak Sen: డైరెక్షన్‌కి విశ్వక్ సేన్ గుడ్ బై..?

Vishwak Direction Out

Vishwak Direction Out

Vishwak Sen To Discontinue As Director: ఒక మనిషిలో ఒకటికి మించి ప్రతిభలు ఉండటంలో తప్పు లేదు. అలాంటి వారిని బహుముఖ ప్రజ్ఞశాలి అని అంటారు. కాకపోతే.. ఒకే సమయంలో రెండు లేదా అంతకుమించి ఎక్కువ పనులు చేసినప్పుడే సమస్యలు వచ్చి పడతాయి. అన్ని విభాగాల్లోనూ పూర్తిస్థాయిలో ఔట్‌కమ్ ఇవ్వకపోవచ్చు. దాంతో.. ఆ ప్రోడక్ట్‌లో ఎక్కడో లోపాలు వస్తాయి. ఇప్పుడు ధమ్కీ విషయంలోనూ అలాంటి లోపాలే చవిచూశాయని ఇండస్ట్రీ వర్గాల్లో సినీ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. నటించడం, నిర్మించడంతో పాటు ఈ సినిమాని విశ్వక్ సేన్ తన స్వీయ దర్శకత్వంలో తీయడం వల్లే.. ఆ తేడాలు కనిపించాయని చెప్పుకుంటున్నారు.

Madhuri Dixit Row: మాధురిపై అవమానకర కామెంట్.. చిక్కుల్లో నెట్‌ఫ్లిక్స్.. లీగల్ నోటీసులు జారీ

అఫ్‌కోర్స్.. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా తొలిరోజు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ అయితే రాబట్టగలిగింది. కానీ.. ఆశించిన స్థాయిలోనే సినిమా ఆకట్టుకోలేదనే వాదనలు వినిపించాయి. క్రిటిక్స్ సహా ప్రేక్షకుల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకే.. రెండో రోజు నుంచి వసూళ్లు బాగా తగ్గుముఖం పట్టాయి. దర్శకుడిగా లిబర్టీస్ తీసుకొని, సెకండాఫ్ విషయంలో విశ్వక్ బోల్తా కొట్టడమే అందుకు కారణమని టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విశ్వక్ సేన్‌కి అతని స్నేహితులు ఓ కీలక సూచన ఇచ్చారట. దర్శకత్వ బాధ్యతల్ని పూర్తిగా పక్కనపెట్టేసి, కేవలం నటన పరంగా కెరీర్‌పై దృష్టి సారించాలని సలహా ఇచ్చారట. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి.. దాన్ని ఎన్‌క్యాష్ చేసుకుంటూ ముందుకు సాగాలని అతని సన్నిహితులు చెప్పినట్టు తెలుస్తోంది.

Kangana Ranaut: ప్రియాంకాను కరణ్ జోహర్ బ్యాన్ చేశాడు.. మరోసారి బాంబ్ పేల్చిన కంగనా

మరి.. స్నేహితుల మాట విని విశ్వక్ సేన్ తన దర్శకత్వ ప్రతిభను పక్కన పెడతాడా? లేక భవిష్యత్తులో మళ్లీ ధమ్కీ (నటన, దర్శకత్వం) లాంటి ప్రయోగాలే చేస్తాడా? ప్రస్తుతానికైతే విశ్వక్ కేవలం హీరోగా మాత్రమే ప్రాజెక్టులు ఒప్పుకుంటున్నాడు. లేటెస్ట్‌గా సితారా ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చూస్తుంటే.. విశ్వక్ ఇప్పట్లో మళ్లీ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వైపు వెళ్లేలా కనిపించడం లేదు.

Show comments